Monday, May 6, 2024
- Advertisement -

నాగ్ కి అఖిల్ పెద్ద షాక్ ఇచ్చాడు!

- Advertisement -

టాలీవుడ్ మ‌న్మ‌థుడుకి తన కుమారులు షాక్స్ ఇస్తున్నారు. నాగార్జున  పెద్ద కుమారుడు నాగ‌చైత‌న్య పెద్ద షాక్ ఇచ్చినట్లు సినీ పరిశ్రమలో కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. నాగచైతన్య టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న స‌మంత‌తో ప్రేమ స్టోరీ నడుపుతున్నట్లు కొన్ని రూమార్స్ వస్తున్నాయి. ఈ వార్తలు విని నాగార్జున కూడా కంగారు ప‌డుతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.

వీరిద్దరు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నట్లు కాకపోతే ఈ విషయంపై నాగ్ కి అసలు ఇష్టం లేద‌ని ఇండ‌స్ర్టీ ఇన్న‌ర్ టాక్. అసలే చైతు విషయంలో కంగారుగా ఉన్న నాగ్‌ కు ఇప్పుడు మరో షాక్ తగిలింది. చైతన్య సమంతతో ప్రేమలో ఉంటే ఇప్పుడు నాగ్ చిన్న కొడుకు అఖిల్ ఓ హైద‌రాబాద్ యువ‌తితో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికాలోని న్యూయార్క్‌లో చ‌దువుకుంటూ ఇప్పుడిప్పుడే ఫ్యాష‌న్ డిజైన‌ర్‌గా ఎదుగుతున్న ఓ యువ‌తితో అఖిల్ ల‌వ్‌లో ప‌డ్డాడ‌ట‌.

అయితే ఆ అమ్మాయి ఫ్యామిలీకి, నాగార్జున ఫ్యామిలీకి మంచి రిలేష‌న్ ఉంద‌ట‌. దీంతో ఇద్దరి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలి అని అఖిల్ ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే చైత్య ప్రేమలో ఉన్నట్లు వార్తలు విని షాక్ అయ్యాడు నాగ్. ఇప్పుడు నాగ్ కి అఖిల్ పెద్ద షాక్ ఇచ్చాడంటూ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో అప్పుడే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -