అల్లు అర్జున్ నటించిన డీజే మూవీ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అనడంలో సందేహం అక్కర్లేదు. ఈ నెల చివరిలో రిలీజ్ కాబోతున్న పవర్ స్టార్ సినిమా కాటమరాయుడు.. యూట్యూబ్ లో ఎన్నో సెన్సేషన్స్ క్రియేట్ చేస్తే.. వాటి అన్నిటి వెనకా అల్లు అర్జున్ డీజే ఉంటున్నాడు.
ఫాస్టెస్ట్ 1 మిలియన్.. 2 .. 3.. 4 మిలియన్.. ఇలా దాదాపు వ్యూస్ రికార్డులన్నీ పవన్ కాటమరాయుడు పేరుపై ఉంటే.. ఆ తర్వాత డీజే నిలుస్తోంది. అలాగే లక్ష లైక్స్ కొట్టించుకోవడంలే సేమ్ సీన్. అయితే.. తేడా ఎక్కడొస్తుందంటే.. డిజ్ లైక్స్ విషయంలోనే. 1.3 లక్షల డిజ్లైక్స్ తో బన్నీ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు.
డిజ్లైక్ కొట్టేందుకు పని గట్టుకుని మరీ వ్యూస్ పెంచుతున్నట్లుగా ఉంది పరిస్థితి. అంతే కాదు.. సినిమా రిలీజ్ విషయంలో కూడా కాటమరాయుడు తర్వాత డీజేనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతా బాగానే ఉంది కానీ.. రికార్డుల వేటలో పవన్ కళ్యాణ్ వెనుకే బన్నీ నిలవడం మాత్రం ఆశ్చర్యకరమే. అసలే ఇద్దరి అభిమానుల మధ్య ఆన్ లైన్ లో కాంట్స్ చేసుకుంటున్నారు. మెగా హీరోలిద్దరూ రికార్డుల వేట కంటిన్యూ చేయడం ఆసక్తి కలిగిస్తోంది. అది కూడా ఫస్ట్ సెకండ్ ప్లేస్ లను ఆక్రమించేస్తుండడం చెప్పుకోదగ్గ విషయమే.
{youtube}NG8rmrogWKE{/youtube}
Related