Sunday, April 28, 2024
- Advertisement -

పుష్ప 3పై బన్నీ కన్ఫామ్ చేసేశాడు!

- Advertisement -

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో తెరకెక్కిన చిత్రం పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో బన్నీ జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఇక ఈ సినిమాకు సీక్వెల్ పుష్ప 2 షూటింగ్ ఇప్పటికే పూర్తి కావడానికి రాగా స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 15న విడుదల కానుంది.

ఇక పుష్ప 2 తర్వాత పుష్ప 3 కూడా ఉండనుందని వార్తలు వస్తున్నాయి. ఇక దీనిపై క్లారిటీ ఇచ్చేశారు బన్నీ. బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్‌కి వెళ్లిన అర్జున్.. పుష్ప 3 కూడా ఉండొచ్చు అని తెలిపాడు. పుష్పని ఒక ఫ్రాంచైజ్ లా తీసుకెళ్లాలని అనుకుంటున్నట్లు తెలిపారు. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా అనసూయ, సునీల్, ఫహద్ ఫాజిల్, రావు రమేష్ కీలక పాత్ర పోషించారు. ఇక పుష్ప 3లో విజయ్ దేవర కొండ నటిస్తారనే వార్తలు వస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -