Monday, April 29, 2024
- Advertisement -

గేమ్ ఛేంజర్..మళ్లీ నిరాశే?

- Advertisement -

ఆర్ఆర్ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. హిట్ చిత్రాల దర్శకుడు శంకర్ నేతృత్వంలో ఈ సినిమా వస్తుండగా భారీ అంచనాలు నెలకొన్నాయి. వాస్తవానికి ఈ సినిమా ప్రారంభమై చాలా రోజులు కావొస్తున్న ఎలాంటి అప్ డేట్ మాత్రం లేదు. తొలుత సెప్టెంబర్‌లో ఈ సినిమాను రిలీజ్ చేస్తారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత డిసెంబర్‌లో విడుదల అవుతుందని వార్తలు వచ్చినా తాజాగా సంక్రాంతికి రిలీజ్ అవుతుందనే బజ్ నడుస్తోంది.

వాస్తవానికి గేమ్ ఛేంజర్ రిలీజ్ పై శంకర్, రామ్ చరణ్, దిల్ రాజు ఇప్పటికే చర్చలు జరిపారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్‌కి మరో 4,5 నెలల సమయం పట్టనున్న నేపథ్యంలో రిలీజ్ డేట్‌ని సంక్రాంతికి పోస్ట్ పోన్ చేసినట్లు తెలుస్తోంది. చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా అంజలీ, శ్రీకాంత్, జయరామ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇక ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సైతం వాయిదా పడిన సంగతి తెలిసిందే. తొలుత ఏప్రిల్ 25న రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటించినా తర్వాత దసరాకు పోస్ట్ పోన్ అయింది. అక్టోబర్ 10న దేవర పార్ట్ 1 రిలీజ్ కానుంది. మొత్తంగా ఇద్దరు ఆర్ఆర్ఆర్ హీరోల సినిమాలు పోస్ట్ పోన్ అవుతుండటం విశేషం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -