ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డీజే-దువ్వాడ జగన్నాధం అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా స్టార్ అయిన దగ్గర నుంచి ఈ సినిమాలో అల్లు అర్జున్ ఒక బ్రాహ్మణుడి పాత్ర పోషిస్తాడని.. అది అదుర్స్ చారి పాత్ర టైపులో ఉంటుందని టాలీవుడ్ ఫిలింనగర్లో టాక్ జోరుగా వినిపిస్తోంది.
ఏది ఏమైనా ఈ మూవీ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. తాజగా విడుదల అయిన ప్రీ లుక్ ఇదే ఖాయం చేస్తోంది. ఫస్ట్ లుక్ రేపు విడుదల అవుతుండగా.. ఇప్పుడు ఇంటర్నెట్ లో ఒక పిక్చర్ హలచల్ చేస్తోంది. ఈ ఫోటో చూస్తుంటే డీజేలో బన్నీ పోషించేది బ్రాహ్మణుడి రోల్ అని తెలుస్తోంది. పిలక పెట్టినట్లుగా దువ్విన జుట్టు.. ఒళ్లంతా విబూధి నామాలు.. పంచె కుట్టు.. కాషాయ వస్త్రం.. మెడలో యజ్ఞోపవీతం.. అబ్బో బన్నీ లుక్ అదిరిపోయిందంతే.
లీక్ అయిన పిక్చర్ అయినా.. ఈ కొత్త లుక్ లో బన్నీ పిక్చర్ ఇప్పుడు వైరల్ అయిపొయింది. ఫస్ట్ టైం అల్లు అర్జున్ ఇలాంటి గెటప్ లో కనిపిస్తుండగా.. ఫ్యాన్స్ ఈ మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అసలు సంగతి ఏంటంటే సరిగ్గా ఫస్ట్ లుక్ రిలీజ్ ముందు ఈ ఫోటో లీక్ అవడంతో చిత్ర యూనిట్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.
Related