పవన్ కి షాక్ ఇచ్చిన అల్లు అర్జున్!

allu arjun beats pawan kalyan in most searched hero at google

మెగా ఫ్యామిలీ సంబంధించిన హీరోలందరూ ఒకే తాటిపై ఉండే వారు. కానీ ఈ మధ్య ఏవో చిన్ని చిన్న తేడాలు రావడంతో  ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మెగా ఫ్యామిలీ యువ హీరోలు అందరూ రెండు వర్గాలుగా విడిపోయి, కొందరు మెగా స్టార్ కు సపోర్ట్ చేస్తుంటే మరికొందరు పవర్ స్టార్ వైపు ఉన్నారు..అయితే అదే క్రమంలో ఈ మధ్య పవన్ కల్యాణ్ కు మన స్టైలిష్ స్టార్ బన్నీ షాక్ ఇచ్చినట్లు సమాచారం…ఇంతకీ విషయం లోకి వెళితే…2016వ సంవత్సరానికి గూగుల్ కు సంబంధించి మోస్ట్ సర్చ్డ్ యాక్టర్ గా అల్లు అర్జున్ అందరి టాప్ హీరోలకన్నా ముందు స్థానంలో ఉన్నాడు అని తెలుస్తుంది.

అదే క్రమంలో గూగుల్ మోస్ట్ సర్చ్డ్ లిస్టులో మొదటి స్థానంలో అల్లుఅర్జున్ కొనసాగుతూ ఉంటే రెండవ స్థానంలో మహేష్ బాబు మూడవ స్థానంలో ప్రభాస్ నాల్గవ స్థానంలో జూనియర్ లు కొనసాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.  ఇక పవన్ కళ్యాణ్ కు సంబంధించి ప్రస్తుతం అతడి స్థానం ఐదవ స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే పవన్ ఫ్యాన్స్ మాత్రం ఈ న్యూస్ ని తీవ్రంగా ఖండిస్తున్నారు….అసలు అలా ఎలా పవన్ స్తాన్నాన్ని మీరు డిసైడ్ చెయ్యగలరు…గూగుల్ లో పవన్ గురించి సర్చ్ చేస్తున్నప్పుడు కొంతమంది పవన్ మరికొంతమంది పవర్ స్టార్ ఇంకొంతమంది పవన్ కళ్యాణ్ అని సర్చ్ చేయడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అని లేకుంటే గూగుల్ సర్చ్ లో టాప్ పొజిషన్ పవన్ కు కాకుండా మరి ఏ టాప్ హీరోకి రాదు అని వారు వాదిస్తున్నారు….ఏది ఏమైనా పవన్-బన్నీ మధ్య మరో వివాదం చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటున్నారు మెగా అభిమానులు…చూడాలి ఏం జరుగుతుందో.

Related

  1. చిరుకు అదిరిపోయే షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్!
  2. పవన్ కొత్త సంవత్సరం ప్లాన్ ఇదే!
  3. పవన్ అభిమానులపై ఫైర్ అయిన ఝాన్సీ
  4. రైల్వే స్టేషన్ విలన్ల చితకబాదిన పవన్!