Tuesday, May 14, 2024
- Advertisement -

వాటి నుండి బయట పడ్డా అల్లు అర్జున్!

- Advertisement -

అల్లు అర్జున్ ఓ భారీ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ప్రమాదం అనగానే కంగారుపడకండి. అసలు విషయం వేరే ఉంది. ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు అంటే ఓ భారీ ప్లాప్స్ నుంచి తప్పించుకున్నాడు. ఇటివలే సునీల్ నటించిన ”కృష్ణాష్టమి ” సినిమాని నిజాన్నికి అల్లు అర్జున్ చేయాల్సిన సినిమా అని ”కృష్ణాష్టమి” రిలీజ్ కు ముందు ఆ చిత్ర దర్శక నిర్మాతలు చెప్పిన విషయం తెలిసిందే.

అయితే ఈ ”కృష్ణాష్టమి” చిత్రం మాత్రం ఎవరు అనుకోని విధంగా భారీ ప్లాప్ అయింది. ఇప్పుడేమో సందిప్ కిషన్ నటించిన ”ఒక్క అమ్మాయి తప్ప” సినిమా కూడా అల్లు అర్జున్ చేయాల్సిన సినిమా అని, సందీప్ కిషన్ చేసాడు అని ఈ చిత్ర ప్రమోషన్ లో చెప్పారు. అయితే ఇప్పుడు ఈ ఒక్క అమ్మాయి తప్ప చిత్రం కూడా భారీ ప్లాప్ అయింది.

దాంతో భారీ డిజాస్టర్ సినిమాల నుంచి బయట పడ్డాడు బన్నీ. ఇటివలే వరస హిట్స్ తో దూసుకెల్తున్నాడు బన్నీ. అయితే అల్లు అర్జున్ తెలివిగా ఆ చిత్రాలను వద్దు అని చెప్పి చాలా మంచి పని చేసాడు. లెదంటే పెద్ద ప్రమాదంలో పడేవాడు..అంటే పెద్ద ప్లాప్ లు చూసేవాడు అనమాట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -