- Advertisement -

రాజకీయాల్లోకి అల్లు అర్జున్? క్లారిటీ ఇదే!

- Advertisement -

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతున్నారనే వార్త ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 2034 ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ఆయన ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నారని సినీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

ప్రస్తుతం తన సినిమాలతో బిజీగా ఉన్న అల్లు అర్జున్, భవిష్యత్తులో రాజకీయ అరంగేట్రం చేసేందుకు గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారని ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో ఆయన సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమిళ స్టార్ హీరో విజయ్‌ను వెనకుండి నడిపించి, ఆయన రాజకీయ ప్రస్థానంలో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిశోర్ తరహాలోనే, బన్నీకి కూడా మార్గనిర్దేశం చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తనకున్న ఫ్యాన్ బేస్‌ను రాజకీయంగా మలుచుకుని, విజయ్ బాటలోనే ప్రజలకు చేరువవ్వాలని బన్నీ భావిస్తున్నట్లు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఒకవేళ బన్నీ నిజంగానే రాజకీయాల్లోకి వస్తే, ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఎంచుకుంటారా లేక తెలంగాణలో అడుగుపెడతారా అనేది ప్రస్తుతం ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది. అయితే, ఈ ఊహాగానాలపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు. అల్లు అర్జున్ అటు వైపు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఈ వార్తలపై అల్లు అర్జున్ సన్నిహిత వర్గాలు స్పందించాయి. ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని వారు తేల్చి చెప్పారు. అల్లు అర్జున్ ప్రస్తుతం తన పూర్తి దృష్టిని కేవలం సినిమాలపైనే కేంద్రీకరించారని, రాజకీయాల వైపు వచ్చే ఆలోచన ఆయనకు లేదని స్పష్టం చేశారు. ఇవన్నీ కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న పుకార్లు మాత్రమేనని వారు కొట్టిపారేశారు. రాకా, లోకేశ్ కనగరాజ్ సినిమాలతో బన్నీ ప్రస్తుతం బిజీగా ఉన్నారని, ప్రస్తుతానికి ఆయనకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని సన్నిహితులు చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -