Saturday, May 18, 2024
- Advertisement -

అభిమానుల కోసం బన్నీ ఏం చేస్తున్నాడో తెలుసా?

- Advertisement -

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం చేస్తున్న సినిమా సరైనోడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో మాస్ సినిమాగా తెరకేక్కుతుంది. ఐతే అభిమానులకోసం బన్నీ ఏం చేయడానికైన సిద్ధంగా ఉంటాడు. తెలుగులో చాలా మంది టాప్ హీరోలు తమ సినిమాలో ఓ పాట పాడటం కామన్ అయిపోయింది.

పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రవితేజ, తదితర నటులు సింగర్స్‌గా టాలెంట్‌ చూపిస్తున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా తన టాలెంట్ చూపించబోతున్నాడు. సరైనోడు సినిమా కోసం అల్లు అర్జున్‌ కూడా ఓ పాట పాడబోతున్నాడు. దేవి శ్రీ ప్రసాద్, తమన్‍లు హీరోలతో పాటలు పాడించడంలో ముందుంటారు. ఐతే సరైనోడు సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఐతే సినిమాలో ఓ పాట అల్లు అర్జున్ పాడితే బాగుంటుందని బన్నీతో ఒక పాట పాడించేసాడట తమన్. ఈ పాట సినిమాకి హైలేట్ అవుతుందని అంటున్నారు. ఐతే ఈ సినిమా ఆడియో వేడుకలో స్టేజీ మీద కూడా బన్నీతో పాడించాలని అనుకుంటున్నారట ఈ సినిమా యూనిట్. సో అల్లు అర్జున్‍లో కూడా సింగర్ అయ్యాడు. ఈ సినిమాని సమ్మర్‍లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -