Monday, April 29, 2024
- Advertisement -

‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ మూవీ రివ్యూ

- Advertisement -

అందాల రాక్షసి తో క్లాసిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న హను రాఘవ పూడి , భలే భలే మగాడివోయ్ సినిమాతో స్టార్ హీరోగా మెట్లు ఎక్కడం మొదలు పెట్టిన హీరో నానీ ల కాంబినేషన్ ఎంత ఆసక్తికరంగా ఉంటుందో కృష్ణ గాడి వీర ప్రేమ గాథ ట్రైలర్ కూడా అంతే ఆసక్తికరంగా కట్ చేసారు. 

సినిమా మీద అప్పటి వరకూ లేని అంచనాలు భారీగా పెంచేసింది ఈ ట్రైలర్. ఆగాడు లాంటి డిజాస్టర్ తర్వాత మీడియం బడ్జెట్ సినిమాలు తీయడం మొదలు పెట్టిన 14 రీల్స్ తొలి ప్రయత్నం ఎలా ఉందొ చూద్దాం.

కథ – పాజిటివ్ లు::

చిన్నప్పటి నుంచీ నానీ – కృష్ణ , మహాలక్ష్మి – మేహ్రీన్ లు ప్రాణంగా ప్రేమించుకుంటూ ఉంటారు. 15 సంవత్సరాలుగా సాగిన వీరి ప్రేమ కథ బయట ప్రపంచానికి తెలీనే తెలీదు. ఎవ్వరిని అడిగినా వారిద్దరూ శత్రువులు అంటారు తప్ప ప్రేమికులు అని నమ్మను కూడా నమ్మరు. ఇది ఇలా ఉంటె ఆ ఊర్లో ఉండే రాజన్న , అప్పిరెడ్డి లు ప్రతీకారానికి మారు పేరు గా బతుకుతూ ఉంటారు రాజన్న చెల్లె మన హీరోయిన్. ఫాక్షన్ గొడవలకీ ప్రేమ కథ తో ఎలా లింక్ పెట్టాడు అనేది డైరెక్టర్ లో మెచ్చుకోవాల్సిన అంశం. ఈ సినిమాకి ఆద్యంతం హీరో నానీ ప్లస్ అని చెప్పాలి. అద్భుత నటన తో కామెడీ తో ఎప్పటి లాగానే ఆకట్టుకున్నాడు, ముఖ్యంగా పతాక సన్నివేశాలలో నానీ నటన ఒక రేంజ్ కి వెళ్ళింది.ప్రేమ కథలకి ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ ని బాగా అటాచ్ చేసాడు డైరెక్టర్ హను. అలాగని మరీ మూస పట్టిన కథలతో వేలాడకుండా కామెడీ జోడించి కుళ్ళు కామెడీ లేకుండా చాలా డీసెంట్ గా సాగించాడు కథని. సెకండాఫ్‌లో ముగ్గురు పిల్లలతో కలిసి హీరో పాత్ర చేసే ఓ ఎమోషనల్ జర్నీ బాగుంది. ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ అన్న టైటిల్ సినిమాకు మంచి అర్థాన్నిచ్చింది. ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్ పార్ట్‌లో కమర్షియల్ అంశాలతో కథను నడిపిస్తూనే, చెప్పాలనుకున్న సెన్సిబుల్ పాయింట్‌ను దర్శకుడు సరిగ్గా చెప్పగలిగాడు. 

నెగెటివ్ లు::

అసలు కథ మొత్తం ఫస్ట్ హాఫ్ లో చెప్పెయ్యడం ఈ సినిమాకి పెద్ద మైనస్ పాయింట్. అసలు విషయం తెలిసిపోవడం తో సెకండ్ హాఫ్ లో సినిమా మొత్తంముందే తెలిసిపోయిన ఫీల్ కచ్చితంగా వస్తుంది. ఆల్రీడీ తెలిసిపోయిన పాయింట్ మీదనే సినిమా జరుగుతూ ఉండడం తో అక్కడక్కడ విసుగు ఒస్తుంది. పైగా సినిమా మొత్తం మీద స్క్రీన్ ప్లే చాలా స్లో గా ఉంది. ఫస్ట్ హాఫ్ లెంత్ చాలా భారీగా ఉంటుంది. ప్రీ ఇంటర్వెల్ ముందరున్న ట్విస్ట్ నే ఇంటర్వెల్ గా మార్చేసి ఉంటె బాగుండేది. సెకండ్ హాఫ్ లో పాటలు అసందర్భంగా వచ్చి విసుగు తెపిస్తాయి. కొన్నిచోట్ల లాజిక్‌లకు అందకుండా కథ నడుస్తూ ఉండడాన్ని మైనస్‌గా చెప్పుకోవచ్చు. ఒక సెన్సిబుల్ పాయింట్‌కు కమర్షియల్ టచ్ ఇచ్చే క్రమంలో కొన్ని చోట్ల అనవసరమైన సన్నివేశాలు ఎక్కువయ్యాయి. 

మొత్తంగా ::

కాస్త స్లో అయినా కానీ సినిమా బాగుంది, కమర్షియల్ ఎలిమెంట్ లు విపరీతంగా గుప్పించాకుండా నే కమర్షియల్ పంథాలో డైరెక్టర్ తీసుకుని వెళ్ళాడు సినిమాని. అందాల రాక్షసి తో సెన్సిబిలిటీ ప్రేక్షకుడికి సరిగ్గా కనక్ట్ చెయ్యలేక పోయిన డైరెక్టర్ రెండవ సినిమాతో విజయం సాధించాడు. ఒక కొత్త ప్రేమ కథ కి వినూత్నమైన ఉప కథలని తగిలించుకుంటూ వెళ్ళిన డైరెక్టర్ హను అవన్నీ కలిపి చివర క్లిమాక్స్ లో సక్సెస్ అయ్యాడు. కాస్త లెంత్ ఎక్కువ అవడం అక్కడక్కడా బోరింగ్ సన్నివేశాలూ పక్కన పెడితే కృష్ణ గాడి వీర ప్రేమ గాథ థియేటర్ లలో జనాలకి కనువిందు చేసి తీరుతుంది. భలే భలే మగాడివోయ్ రేంజ్ లో కాకపోయినా వారాంతం తప్పక చూడదగ్గ లవ్ స్టోరీ కం చేజ్ డ్రామా ఇది . హిట్టు సినిమా  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -