- Advertisement -
ఉదయ్ శెట్టి దర్శకత్వంలో యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ గం..గం..గణేశా. ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా నటిస్తుండగా హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. తన కెరీర్ లో ఆనంద్ చేస్తున్న ఫస్ట్ యాక్షన్ మూవీ గం గం గణేశా.
ప్రతి సినిమాలో కొత్త దనాన్ని చూపించే ఆనంద్ దేవరకొండ మూవీ కోసం అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫస్ట్ టైమ్ ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించబోతున్నారు ఆనంద్. ఇందుకోసం రిలీజ్ చేసిన ఫోటో సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచేసింది. సి
యాక్షన్ క్రైమ్ కామెడీ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 31న థియేటర్స్ లోకి రానుంది. ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా నటించగా ఆనంద్ ఈ సినిమాపై భారీ ఆశలను పెట్టుకున్నారు.