Saturday, May 4, 2024
- Advertisement -

నటీ నటులకు ఆనంద్ దేవరకొండ ఆహ్వానం

- Advertisement -

రౌడీ హీరో విజయ్ దేవరకొండ .. సోదరుడిగానే సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చినా.. కెరీర్ ప్రారంభం నుంచి ప్రయోగాత్మక చిత్రాలు ఎంచుకుంటూ తనదైన మార్క్ కనబరుస్తున్నాడు హీరో ఆనంద్ దేవరకొండ. తాజాగా ఈ యంగ్ హీరో… గం గం గణేశా పేరిట న్యూ ఏజ్ యాక్షన్ థ్రిల్లర్‌లో నటించబోతున్నాడు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది.

ఆనంద్ తాజాగా ఓ వీడియో ద్వారా “గం గం గణేశా” ఆడిషన్స్ విషయాన్ని ప్రకటించారు. సినిమాలో సపోర్టింగ్ రోల్స్ కోసం ఆడిషన్స్ ఇవ్వడానికి ఔత్సాహిక నటీనటులను ప్రోత్సహించడమే ఈ వీడియో ప్రధాన ఉద్దేశం. ఆసక్తి ఉన్నవారు తమ ఆడిషన్ క్లిప్‌లను మార్చి 15లోగా పంపాలన్నాడు హీరో ఆనంద్. 25 నుంచి 55 ఏళ్ల వరకు వివిధ పాత్రల కోసం నటులు, 18-20 ఏళ్ల ఒక పాత్రకు నటికి అవకాశం ఉంది.

ఉదయ్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న “గం గం గణేశా” చిత్రంలో ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తెలుగమ్మాయికి బాలీవుడ్ ఆఫర్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -