Sunday, May 4, 2025
- Advertisement -

అనసూయ ఓపెన్..ఎప్పుడూ దానికి సిద్ధమే!

- Advertisement -

బుల్లితెరపై యాంకర్ అనసూయది ప్రత్యేక స్ధానం. ఎందుకంటే బుల్లితెరకు గ్లామర్‌ అద్దిన యాంకర్లలో అనసూయ ముందువరుసలో ఉంటారు. అందం, అభినయమే కాదు తనదైన చలాకితనంతో యాంకరింగ్‌కే కొత్త వన్నెలు తెచ్చింది అనసూయ. ఇప్పటికి బుల్లితెరే కాదు వెండితెరపై అనసూయది ప్రత్యేక స్ధానమే. ఐటం సాంగ్ అయినా, తాను ఎంచుకున్న ఏ పాత్ర అయినా ఒదిగిపోవడం ఆమె ప్రత్యేకం.

అందుకే భిన్న పాత్రలను ఎంచుకుంటు ముందుకు సాగుతోంది అనసూయ. తాజాగా ఆమె నటించిన రజాకార్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండగా ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

ఈ సినిమాతో కొంత నేర్చుకున్నాను..తాను మారానని అనుకోవడంలో నిజం లేదన్నారు. స్పెషల్ సాంగ్స్ ఇప్పుడు కూడా చేస్తాను..నాకోసం రాసిన పాత్ర ఎలాంటిదైనా చేస్తాను. కాబట్టి నేను అన్ని రకాల పాత్రలు, సాంగ్స్, గ్లామరస్ రోల్స్ చేయడానికి సిద్ధమని అన్నారు. ప్రస్తుతం బుల్లితెరకు బ్రేక్ ఇచ్చిన అనసూయ…వెండితెరపై వరుస సినిమాలు చేస్తుండగా వరుస ఆఫర్‌లు ఆమెకు క్యూ కడుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -