Tuesday, May 21, 2024
- Advertisement -

రెండో రోజు విచారణకు లోకేష్‌తో పాటు మరొకరు

- Advertisement -

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్పు కేసులో సీఐడీ విచారణకు రెండో రోజు హాజరయ్యారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. తొలి రోజు మధ్యాహ్నం గంట పాటు లంచ్ బ్రేక్ ఇచ్చిన అధికారులు ఉదయం 10 గంటల నుండి 6 గంటల వరకు విచారించారు. ప్రధానంగా హెరిటేజ్ సంస్థకు లబ్ది చేకూరేలా లోకేష్ వ్యవహరించారని ఆరోపణ. దీనిపైనే ప్రధానంగా ప్రశ్నలు సంధించారు. ఇక రెండో రోజు విచారణకు లోకేష్‌ హాజరుకాగా మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ కూడా సీఐడీ విచారణకు వచ్చారు.

ఇదే కేసులో పునీత్ కి కూడా సీఐడీ నోటీసులు ఇవ్వగా ఇవాళ విచారణకు హాజరయ్యారు. అయితే సీఐడీ ఇచ్చిన నోటీసులుపై పునీత్ హైకోర్టును ఆశ్రయించగా లాయర్ల సమక్షంలో ఆయన్ని విచారిస్తున్నారు.అదే సమయంలో సీఐడీ విచారణకు సహకరించాలని పునీత్‌కు సూచించింది న్యాయస్థానం. ఇద్దరినీ వేరువేరుగా విచారిస్తున్న సీఐడీ అధికారులు వారి స్టేట్‌ మెంట్‌ను రికార్డు చేస్తున్నారు.

తొలిరోజు లోకేష్‌ను ప్రధానంగా 30 ప్రశ్నలు అడిగారు సీఐడీ అధికారులు. రాజధాని ప్రాంతంలో లే అవుట్ రిజిస్ట్రేషన్ మినహాయిపు ఎందుకు ఇచ్చారని ,హెరిటేజ్ ఫుడ్స్ మేనేజ్‌మెంట్ కమిటీ, బోర్డు పాత్ర ఏంటి? నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు అని ప్రశ్నల వర్షం కురిపించారు. పార్టీ అకౌంట్ నుండి లింగమని కంపెనీకి డబ్బులు వెళ్లాయా అని ప్రశ్నించగా సీఐడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు మధ్యలో లోకేశ్ న్యాయవాదుల సలహా తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా రెండోరోజు విచారణలో కూడా లోకేష్‌ నుండి పలు సమాధానాలను రాబట్టనున్నారు అధికారులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -