Friday, May 3, 2024
- Advertisement -

ప్రదీప్ ఢీ షో మానేయడానికి కారణం ఇదే..!

- Advertisement -

తెలుగు లో వచ్చే ఢీ షోకి మంచి క్రేజ్ ఉంది. ఇప్పటికే ఈ ఢీ షో 11 సీజన్లు పూర్తి చేసుకుని 12వ సీజన్లోకి అడుగు పెట్టింది. ఇంకా ఈ ఢీ నుంచి చాలా సీజన్లు రానున్నాయి. ఇక ఈ షో ద్వారా ఎంతో మంది డాన్సర్లుగా, డాన్స్ మాస్టర్లుగా ఎదిగారు. సౌత్ లోనే నెంబర్ వన్ డాన్స్ షోగా ఢీ పేరు తెచ్చుకుంది. అయితే ఈ డాన్స్ షో లో కేవలం డాన్స్ లు మాత్రమే కాకుండా సుధీర్, రష్మీలా రొమాంటిక్ కామెడీ.. ప్రదీప్ యాంకరింగ్ పంచులు ఈ షోకి ఎంతో స్పెషల్.

ఇక ప్రదీప్ విషయానికి వస్తే.. ఇప్పటికే ‘ఢీ 10’, ‘ఢీ జోడి’ సీజన్లకు యాంకర్ గా ప్రదీప్ వ్యవహరించాడు. ఈ రెండు సీజన్లలో సుధీర్, రష్మీలు టీం లీడర్లుగా ఉన్నారు. అయితే ‘ఢీ 12’ సీజన్‌కు వచ్చేసరి అన్ని మార్చేశారు. ఢీ అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది యాంకర్ ప్రదీప్. ఆయన తన పంచులతో యాంకరింగ్ అదరగొడుతాడు. కానీ ఈ సారి ప్రదీప్ ను ఈ షో నుంచి తీసేశారు ఢీ షో యాజమాన్యం. అయితే ఈ షో నుంచి ప్రదీప్ తప్పుకోవడానికి పలు కారణాలు వినిపిస్తున్నాయి.

ఈ సీజన్ వచ్చేసరికి మల్లెమాల వాళ్లు ప్రదీప్ కోరినంత రెమ్యూనరేషన్ ఇవ్వలేదని సమాచారం. అంతేకాదు ప్రదీప్ కూడా తాను కూడా ఓ హీరో రేంజ్‌లో తనను ఊహించుకొని వాళ్ల ఇస్తానన్న పారితోషకానికి ఇంకా ఎక్కువ డిమాండ్ చేసినట్టు సమాచారం. రెమ్యునరేషన్ ప్రాబ్లమ్ కావడం వల్లే ప్రదీప్ ఈ షో నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక పోతే ఢీ షోని ఇష్టపడే ప్రేక్షకులు మళ్లీ ప్రధీప్ రావాల్సిందే అని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పెడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -