Saturday, April 27, 2024
- Advertisement -

గురక పెట్టి నిద్రపోతున్నారా ? ప్రాణాలకే ప్రాబ్లమ్..!

- Advertisement -

ప్రతి ఒక్కరు రాత్రైతే చాలు ప్రశాంతంగా పడుకోవాలి అనుకుంటారు. అయితే కొందరికి కొన్ని ఇబ్బందులు తమ వల్ల కాకుండా తమ పక్కన వారి వల్ల తప్పవు. గురక పెట్టేవాళ్లు హ్యాపీగా పడుకుంటారు. కానీ.. తమ పక్కన పడుకునేవారికే అసలు సమస్య. గురుక పెట్టేవాళ్ళు పక్కన ఉంటే అసలు నిద్రపోలేరు కొందరు. అయితే తాజా ఆధ్యయనం ప్రకారం గురుకపెట్టి నిద్రపోయేవారికి భవిష్యత్తులో ఆరోగ్యానికి జరిగే నష్టం ఎక్కువ అని స్పష్టం చేసింది.

గురక వల్ల గుండెపోటుతో నిద్రలోనే ప్రాణం పోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. అయితే గురకకు చాలా కారణాలు ఉన్నాయి. గురకకు స్థూలకాయం పెద్దగా ఉండటం. కొండ నాలుక పెద్దగా ఉండటం.. దవడల నిర్మాణంలో తేడాల వల్ల గురక వస్తుందట. పై కారణాల వల్ల త్వరగా మెలకువ వచ్చి ఆక్సిజన్ లోపం కలుగుతోంది. ఇక గురకకు గుండెకు లింక్ ఏంటంటే.. శ్వాసకు ఇబ్బందులు ఏర్పడితే సరిపడా ఆక్సిజన్ అందదు.

ఇలాంటి సందర్భాల్లో గుండె మీద ఒత్తిడి పెంచుతుంది. అప్పుడు ఒక్కసారిగా గుండె ఆగిపోవచ్చు. సాధారణంగా గుండెపోటుతో నిద్రలోనే ప్రాణం పోతుంది. అయితే గురకతో నిద్రా భంగం కలగకుండా నోట్లో అమర్చుకునే పరికరాలున్నాయి. స్లీఫ్ నియంత్రించే పరికరం సీపాప్ ఉపయోగించవచ్చు. గురక వల్ల గుండె జబ్బుకు కారణం అవుతుంది కాబట్టి కాస్త జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -