Monday, May 13, 2024
- Advertisement -

శ్రీయ వేధింపులు ఎక్కువైయ్యాయి.. కాపడండి : శ్రీయపై భర్త అండ్రూ

- Advertisement -

లాక్‌డౌన్ టైంలో శ్రీయ దంపతులు రొమాంటిక్ గొడవ పడుతున్నారు. చిలిపి ఆటలతో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. శ్రీయ ప్రస్తుతం గ‌‌ృహస్థ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. విషయంలోకి వెళ్తే.. కరోనావైరస్ కారణంగా అన్ని దేశాలు లాక్‌డౌన్‌ను విధించాయి. ఈ పరిస్థితుల్లో స్టార్ హీరోయిన్ శ్రీయా సరన్ భర్త అండ్రూ కొశ్చివ్‌తో రష్యాలో దాంపత్య జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు.

ఈ క్రమంలో వారిద్దరు చిలిపి ఆటలతో ఫ్యాన్స్‌కు వినోదాన్ని పంచుతున్నారు. ఈ క్రమంలో శ్రీయపై భర్త ఆండ్రూ ఫిర్యాదు చేయడం ఫన్నీగా మారింది. టిక్ టాక్ యాప్‌లో తాజాగా ఓ వీడియోను శ్రీయ పోస్టు చేసింది. నేను నా భర్త ఆండ్రూ కొశ్చీవ్‌ను ఎందుకు పెళ్లి చేసుకొన్నానో తెలుసా? ఇలా గిన్నెలు తోయించడానికే. మా ఆయన ఇలా గిన్నెలు కడుగుతున్నాడు. మీరు మీ భర్తలను ఇలానే వంట గిన్నెలను తోమించే పనిచేయాలని నా ఫ్రెండ్స్, అభిమానులు, సన్నిహితులకు సవాల్ విసిరుతున్నాను అని శ్రీయ పేర్కొన్నారు. మరో వీడియోను పోస్టు చేసిన శ్రీయ.. సోషల్ డిస్టెన్స్‌ను పాటించండి అంటూ ప్లకార్డు ప్రదర్శించింది. దానికి జవాబుగా భర్త మరో ప్లకార్డును చూపిస్తూ.. నాన్‌స్టాప్‌గా మాట్లాడుతున్నది.

ఆమె నసను భరించలేకపోతున్నాను అని ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత మరో ప్లకార్డును శ్రీయ చూపిస్తూ థ్యాంక్ యూ. నాన్ స్టాప్‌గా వర్క్ చేస్తున్న ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు అని చూపించారు. దానికి జవాబుగా నన్ను ప్రతీ రోజు ఎడతెరిపి లేకుండా పనిచేయిస్తుంది అని భర్త కార్డు చూపించారు. కరోనా టైంలో జాగ్రత్తలు తీసుకోండి. ఇంట్లోనే ఉండండి. కోవిడ్ 19ను తరిమి కొట్టండి అంటూ మరో ప్లకార్డును చూపిస్తే.. దానికి ఆమె నుంచి నన్ను కాపాడండి. నన్ను బయటపడేసేలా ప్రార్థించండి అంటూ భర్త మరో కామెంట్‌ను చూపించాడు. ఇలా ప్లకార్డును చూపిస్తూ ఇద్దరు సరదా ఆటలు ఆడుతూ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నారు.

https://www.instagram.com/p/B-xJLB1ld18/?utm_source=ig_embed

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -