Friday, May 3, 2024
- Advertisement -

‘జబర్దస్త్’ సాయి తేజ గురించి సీక్రెట్స్..!

- Advertisement -

జబర్దస్త్ షో గురించి అందరికి తెలిసిందే. ఈ షో ఎంతో మందికి మంచి లైఫ్ ఇచ్చింది. ఈ షో ద్వారా పరిచయం అయినవాళ్లు సినిమాల్లో కూడా మంచి పాపులారిటీ సంపాధించుకున్నారు. సినిమాలే జీవితం అనుకుని తిరిగిన ఎంతో మందికి జబర్దస్త్ షో ఎంతో సాయం చేసిందని చెప్పాలి. ఈ షో వచ్చిన తర్వాత దీనికి పోటీగా చాలా షోస్ వచ్చాయి కానీ ఏది కూడా జబర్దస్త్ ని బీట్ చేయలేకపోయాయి. ఇప్పటికి జబర్దస్త్ షో నెంబర్ వన్ గా దూసుకెళ్తోంది.

ఇదిలా ఉంటే… ‘జబర్దస్త్’ షో లో లేడీ గెటప్ లు వేస్తూ హల్ చల్ చేసిన సాయి తేజ అందరికీ గుర్తుండే ఉంటాడు. అయితే అబ్బాయి నుంచి పూర్తిగా అమ్మాయిగా మారిపోయి.. అతని పేరు ప్రియాంకా సింగ్ గా మార్చుకున్నాడు. మొన్నటికి మొన్న ఈమె పెళ్ళి చేసుకుంది అనే వార్తలు కూడా వచ్చాయి. అయితే అవన్నీ రూమర్సే అని ప్రియాంకా సింగ్ తేల్చేసింది. ఈమె అమ్మాయిగా మారాలి అని డిసైడ్ అయినప్పుడు తన తల్లిదండ్రులకు చెప్పలేదట.

ఈ విషయం వారికి తెలుస్తే అసలు ఒప్పుకోరని.. చిన్నప్పటి నుండే ఈమెకు అమ్మాయిలా ఉండాలనే కోరిక ఉండేదట. ఎవ్వరికీ తెలీకుండా తన అక్క బట్టలు వేసుకుని.. అద్దం ముందు చూసుకునే దాన్ని అని ఈమె తెలిపింది. ఇక ఈమె అమ్మాయిలా మారడానికి లక్షలు ఖర్చు పెట్టిందట. అయితే అంతా తన కష్టార్జితమే అని తెలిపింది. ప్రస్తుతం ‘అదిరింది’ షో లో చేస్తుందట. సినిమాల్లో నటించడానికి రెడీ అని ఎక్స్పోజింగ్ చెయ్యడానికి కూడా నేను రెడీ అని ప్రియాంకా సింగ్ చెబుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -