Sunday, May 12, 2024
- Advertisement -

అభిమానులు కొంత బాధ పడుతున్నారు!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే అభిమానులో భారీ అంచనాలు ఉంటాయి. అందుకు తగ్గట్లుగానే సర్దార్ సినిమా పై భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి మొదటి రోజే భారీ కలక్షన్లు వసులు చేసింది. పవన్ కు ఉన్నా క్రేజ్ వల్ల భారీ కలక్షన్స్ వస్తున్నాయి. కానీ సినిమా పై మాత్రం నెగిటివ్ టాక్ వినబడుతుంది.

సినిమా కథలో కానీ కథనంలో కాని దమ్ము లేదు అని అంటున్నారు. ఈ సినిమాకి స్వయంగా పవనే కథ అందించాడు. అలాగే పవన్ గతంలో జానీ సినిమా కోసం కథ అందించడమే కాకుండా దర్శకత్వం కూడా చేపట్టి భారీ అపజయాన్ని పొందాడు పవన్ కళ్యాణ్ అది ఇచ్చిన షాక్ తో చాలాకాలం కథ ,కథనాల జోలికి పోకుండా హాయిగా సినిమాలు చేస్తూ పోయాడు అయితే మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత కథ ,స్క్రీన్ ప్లే అందించి బాబీ ని దర్శకుడి గా పెట్టి సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చేసాడు కానీ అది బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పొందింది.

ఇప్పటికైతే పవన్ కున్న ఇమేజ్ తో భారీ కలెక్షన్లు వస్తున్నప్పటికీ , ఈ చిత్రాన్ని కొనుక్కున్న వాళ్ళకు నష్టాలను మిగిల్చనుంది అనే టాక్ వినిపిస్తోంది . మొదటి సరిగా కథ అందించిన జానీ , చాలా కాలం తర్వాత అందించిన సర్దార్ గబ్బర్ సింగ్ రెండు కూడా పరాజయం పోందడం తో అభిమానులు కొంత బాధ పడుతున్నారు. సో ఇక పైన అయిన పవన్ కథలు అందించడం, దర్శకత్వం వహించడం లాంటివి చేయకుండా దర్శకుల చెప్పే కథలు విన్ని సినిమాలు చేస్తే బేటర్ అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -