- Advertisement -
లోక్ అదాలత్‌లలో నానాటికి సవాళ్లు రెట్టింపు అవుతున్నాయని, పేదలకు న్యాయసహాయం అందేలా అందరూ పునరంకింతం కావాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్ వ్యాఖ్యానించారు. శనివారం హైదరాబాద్ లో ప్రారంభమైన జాతీయ న్యాయ సదస్సులో ఆయన పాల్గొన్నారు.
లోక్ అదాలత్ చేస్తున్న సేవలను, న్యాయ సలహాలను ఆయన కొనియాడారు. చట్టాలు, హక్కుల గురించి తెలియని వారికి లోక్ అదాలత్ ఎంతో మేలు చేస్తాయని సదస్సులో పాల్గొన్న కేంద్ర మంత్రి సదానంద గౌడ్ వ్యాఖ్యనించారు. లోక్ అదాలత్ మరింత చురుకుగా పని చేసేందుకు అందరూ సహకరించాలన్నారు. తెలంగాణ మఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు మాట్లాడుతూ లోక్ అదాలత్ ద్వారా పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. త్వరలో తెలంగాణలో మీడియేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు.
