- Advertisement -
సినిమా పరిశ్రమలో.. చాలా మంది.. హీరోయిన్స్ అవ్వాలని కలలు కంటూ ఉంటారు. స్టార్స్ గా వెలగాలని ఆశపడుతుంటారు. అలాగే అవకాశలకోసం వచ్చి .. మోసపోయిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. అయితే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలుగుతున్న అనుష్క ఈ విషయంపై ఎందుకో చాలా సీరియస్ అయింది..? బయటి నుంచి చూస్తే.. పరిశ్రమ చాలా గ్లామరస్ గా ఉంటుందని.. ఇందులో ఉన్న వారంతా చాలా హాయిగా ఉన్నట్లు కనిపిస్తారని.. ఈ వెలుగులోకి రావడానికి ఎంతో కష్టపడాల్సి ఉంటుందని.. చెబుతోంది.
షూటింగ్ లో ఎప్పుడు తింటామో.. ఎప్పుడు నిద్దర పోతామో కూడా తెలియదని.. ఎలాంటి అలసటను ముఖంలో చూపించకుండా చాలా జగ్రత్త పడుతామని.. ఇక్కడ నిలబడాలంటే సరైన ప్లానింగ్ ఉండాలని.. ఎంతైనా కష్టపడాలని ఆలా చేస్తే తప్ప.. అనుకున్న స్థాయికి చేరుకోలేమని అంటుంది. అన్నట్లు మొదట్లో అనుష్క కూడా హీరోయిన్ కావడానికి చాలా కష్టపడింది .. మరి !!