ఓపెన్ హార్ట్ విత్ వికే పోరి ముచ్చట్లు ఈమధ్య మార్కెట్లో మరీ ఎక్కువైపోయాయి. క్రికెటర్ గా విరాట్ కోహ్లీ(వీకే) మైదానంలో పరుగులు సృష్టించిన సృష్టించక పోయినా… ఈయనగారి డార్లింగ్ అనుష్క శర్మ మాత్రం వద్దన్నా హార్ట్ బ్రేక్ చేస్తూనే ఉంది.
డైలీ ఏదో ఒక రచ్చ చేయందే అమ్మాయిగారికి నిద్ర పట్టదనుకుంట. రీసెంట్ గా వీకేతో సఫారీ ట్రిప్ వేసొచ్చిన దగ్గరనుంచి ఈవిడగారి దూకుడు మరీ ఎక్కువైపోయింది.
విరాట్ ట్రిప్ ఏ రేంజ్ లో శాటిస్‌పై చేశాడో తెలియదు గాని దానికి పైత్యాన్ని స్టేట్ మెంట్ల రూపంలో చూపించేస్తోంది. లిప్ లాక్ లు ,ఓపెన్ రిలేషన్ షిప్ లపై అనుష్క శర్మ ఓ రేంజ్ లో స్పందించింది..
పెళ్లి తర్వాత ఎవరెలా అనుకున్నా… తాను మాత్రం లిప్ లాక్ లు ఆపేది లేదని, రొమాంటిక్ సీన్స్ చేయమంటే కొందరిలా పెళ్లయ్యాక భయపడనని కరీనాను ఉద్దేశించి చెప్పింది. ఎందుకంటే కరీనా ఒకప్పటిలా రొమాంటిక్ సీన్స్ లో చేయడం మానేసింది. అక్కడితో ఊరుకోకుండా రణబీర్ ,రణ్‌వీర్ లపై తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టి మరీ చెప్పింది.