Thursday, May 16, 2024
- Advertisement -

మళ్లీ కలుస్తున్నారట!

- Advertisement -

సెలెబ్రిటీలు ఎప్పుడు విడిపోతారో? ఎందుకు విడిపోతారో ఎవరికీ తెలియదు.. మామూలు జనాలకైతే అసలు అర్థమే కాదు. విడిపోయాక కూడా ఏదైనా సందర్భాల్లో ఎదురు పడితే.. మామూలు మనుషుల్లా పలకరించుకోవడం కూడా కొందరిని అయోమయానికి గురి చేస్తుంటుంది. కానీ.. తాము మాత్రం ఇందుకు డిఫరెంట్ అని ప్రూవ్ చేసుకుంటున్నారు.. క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ.

కొన్నాళ్ల క్రితం వరకూ ఈ ప్రేమపక్షుల సందడి గురించి అంతా మాట్లాడుకున్నారు. స్టేడియంలో విరాట్ వీర విహారానికి.. సంబరపడిన అనుష్కను చూసి ముచ్చటపడ్డారు. కానీ.. అందరు సెలెబ్రిటీల్లాగే వీరు కూడా విడిపోతున్నారని తెలిసి నిట్టూర్చారు. కానీ.. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి మనుసులో ఇష్టం ఏ మాత్రం పోలేదని.. ఇప్పుడిప్పుడే తెలుస్తోంది.

తన జీవితానికి అనుష్క అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా భావిస్తున్న విరాట్ కోహ్లీ.. అనుష్క వాళ్ల అన్నయ్యతో రాయబారం నడిపిస్తున్నాడని తెలుస్తోంది. మరోవైపు.. రీసెంట్ గా విరాట్ కు ఫోన్ చేసి మరీ.. బాగా ఆడావ్ అంటూ అనుష్క కంగ్రాట్స్ చెప్పినట్టు మరో వార్త వినిపిస్తోంది. దీంతో.. ఇద్దరూ మళ్లీ లవ్వాట మొదలు పెట్టడం ఖాయమని కూడా న్యూస్ కోడై కూస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -