Friday, May 17, 2024
- Advertisement -

కాపులకు రిజర్వేషన్లు ఖాయమట!

- Advertisement -

ఇస్తే ఎప్పుడో ఇచ్చేవాళ్లు. ఇప్పటిదాకా ఎందుకు తెచ్చుకుంటారు అని చంద్రబాబుపై విమర్శలు జోరందుకుంటున్నాయి. కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులస్తులకు.. రిజర్వేషన్లు కల్పిస్తామని ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సాక్షిగా… గవర్నర్ నరసింహన్ తో చెప్పించిన బాబు సర్కార్ పై.. ఈ విమర్శలు.. ఇప్పుడు మరింతగా పెరుగుతున్నాయి.

ముద్రగడ పద్మనాభం.. కాపు గర్జన సభతో సృష్టించిన విధ్వంసాన్ని మరిచిపోలేకపోతున్న ఏపీ అధికార పార్టీ.. ప్రజల్లో అసంతృప్తిని చల్లార్చేందుకే.. కాపులకు కచ్చితంగా రిజర్వేషన్లు ఇస్తామని గవర్నర్ ప్రసంగంలో ఓ లైన్ చేర్చినట్టు కనిపిస్తోంది. మరోవైపు… ఇదే విషయంపై బీసీల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో అన్న అయోమయంతో.. ఎవరికీ అన్యాయం జరక్కుండానే రిజర్వేషన్లు చేస్తామని చెప్పించినట్టు స్పష్టమవుతోంది.

రిజర్వేషన్లు ఇస్తామని చెబుతున్న ప్రభుత్వం.. ఇప్పటికిప్పుడు ఇవ్వలేమని కూడా రీసెంట్ గా చెప్పుకొచ్చింది. ఆ మాటను ఎవరైనా అంగీకరిస్తారు. రిజర్వేషన్లు కల్పించాలంటే.. ప్రభుత్వ స్థాయిలో చేయాల్సిన కసరత్తు మామూలుగా ఉండదు. అవసరమైతే చట్టాలు కూడా మార్చాల్సి వస్తుంది. అందుకే.. ఇన్నాళ్లూ చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎవరూ అంత సీరియస్ గా తప్పు బట్టలేదు. కానీ.. ముద్రగడ దీక్ష తర్వాతే.. కొన్ని వర్గాల్లో కాస్త తేడా స్పష్టంగా కనిపిస్తోంది.

రిజర్వేషన్ల ప్రక్రియను ఇంత సమయంలో పూర్తి చేస్తామని బాబు ప్రభుత్వం చెప్పలేకపోవడం కూడా ఈ పరిస్థితికి కారణమవుతోంది. అందుకే.. ఏదో ఒక టైమ్ చెప్పి.. కాపుల్లో, బీసీల్లో నమ్మకం కలిగించేలా వ్యవహరిస్తే టీడీపీకి మంచి పేరు వచ్చి ఉండేదని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -