Thursday, May 16, 2024
- Advertisement -

కొత్తమ్మాయి కావాలి అంటున్న మహేష్ బాబు

- Advertisement -

మహేష్ బాబు – మురుగదాస్ ల సినిమా అనగానే మహేష్ ఫాన్స్ కి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసింది. కత్తి లాంటి బ్లాక్ బస్టర్ తో తమిళ నాట విజయ్ స్టామినా పెంచుతూ వంద కోట్లు కలక్ట్ చేసిన మురుగదాస్ తెలుగులో మహేష్ కి కూడా వంద కోట్ల సినిమా ఇస్తాడు అని వారు కొండంత ఆశతో ఉన్నారు.

ప్రస్తుతం మహేష్‌, శ్రీకాంత్‌ అడ్డాల కాంబినేషన్‌లో పివిపి నిర్మిస్తున్న ‘బ్రహ్మూెత్సవం’ చిత్రం తర్వాత మురుగదాస్‌ సినిమా స్టార్ట్‌ అవుతుందట. మురుగదాస్‌తో సినిమాని చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకున్న మహేష్ – మురుగదాస్ లు హీరోయిన్ కూడా చాలా పెక్యూలియర్ గా ఉండాలి అని కోరుకుంటున్నారు.

ఆ మధ్య దీపికా పడుకోనే అని వార్తలు వచ్చాయి కానీ ఎక్కడా ఓకే అవ్వలేదు. దీపికా కంటే కొత్త హీరోయిన్ ని తీస్కుందాం అని మహేష్ మురగదాస్ కి సిఫార్సు చేసాడట. బ్రహ్మోత్సవం షూటింగ్ మార్చ్ నెలాఖరుకల్లా అయిపోతే వెంటనే మురగదాస్ సినిమా షూటింగ్ జాయిన్ అయిపోతాడు మహేష్ బాబు, ఇలోగా ఒక కొత్త హీరోయిన్ ని పట్రావాలి అని తన బృందానికి ఆర్డర్ చేసాడు మహేష్ బాబు. ఎప్రి లో షూటింగ్ అంటే ఇప్పటి నుంచీ స్క్రీన్ టెస్ట్ లు లాంటివి చేసుకోక తప్పదు మరి .

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -