Sunday, May 19, 2024
- Advertisement -

సుకుమార్ కి అంత సీన్ లేదు, ఆ ఐడియా ఎన్టీఆర్ దే !

- Advertisement -

ఫాలో ఫాలో అంటూ ఎన్టీఆర్ పాడిన పాట నాన్నకు ప్రేమతో సినిమాకి హై లైట్ గా మారింది. ఈ పాటలో లండన్ వీధుల్లో హీరోయిన్ రకుల్ ప్రీత్ వెంట పడుతూ ఒక హోవర్ బోర్డు మీద వెళుతూ ఉంటాడు ఎన్టీఆర్. ఈ పాటలో వాడిన ఆ హోవర్ బోర్డు ఖరీదు ఏకంగా వెయ్యి డాలర్లట . ఇప్పుడు అందరూ దీన్ని కొనుక్కుందాం అని చూస్తున్నారు.

ఇండియా లోనే లండన్ లో కంటే చీప్ గా దొరుకుతున్నాయి ఈ హోవర్ బోర్డు లు ఇప్పుడు. పాతిక వేలకే దొరకడం తో ఎన్టీఆర్ ఫాన్స్ చాలామంది కొనేస్తున్నారు కూడా.ఇంతకీ విషయం ఏంటంటే హోవర్ బోర్డు మీద సుకుమార్ కన్ను ఎలా పడింది అనేది. నిజానికి ఈ ఐడియా సుకుమార్ ది కాదు ఎన్టీఆర్ ది అంటున్నారు.

క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కంటే ఎన్టీఆర్ ఈ విషయంలో సూపర్ గా ఆలోచించాడు. లండన్ లో రోజూ తన ఫిజిక్ ను ఫిట్ గా ఉంచుకోవడానికి జిమ్ చేశేవాడట తారక్. ఆ సమయంలో అక్కడికి ఓ ఇద్దరు ముగ్గురు ఆ హోవర్ బోర్డుపై రావడం చూశాడట.

అది నచ్చి తన కాస్ట్యూమ్ డిజైనర్ అశ్విన్ తో ఈ విషయం చెప్పడం నాలుగు రోజుల తరవాత అశ్విన్ దీన్ని పట్రావడం జరిగింది. అప్పటి నుంచీ తన హోటల్ కారిడార్ దగ్గర నుంచీ ఎక్కడికి వెళ్ళాలి అన్నా ఇది వాడుతూ ఉండడం తో సినిమాలో కూడా దీన్ని వాడేసాడు సుకుమార్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -