Sunday, May 5, 2024
- Advertisement -

టీవీ9 యాంకర్ కి షాక్ ఇచ్చిన అర్జున్ రెడ్డి

- Advertisement -

తమ టీఆర్పీ ని పెంచుకోవడం కోసం మీడియా ఏదైనా చిన్న విషయం దొరికితే రచ్చ రచ్చే. అయితే టీవీ9 గత వారం మహేష్ కత్తి పవన్ పై కామెంట్స్ చేస్తే.. ఆ విషయంపై మహేష్ కత్తి ఇష్యూను హైలెట్ చేసింది. ఇప్పుడు అర్జున్ రెడ్డి మీద ఫోకస్ చేశారు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ, బాలయ్య ఫ్యాన్స్ మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేశారు.

అయితే విజయ్ ఎదురుమాట్లాడకుండా సమాధనం ఇచ్చేసరికి.. యాంకర్ ఏం చేయలేక సైలెంట్ అయిపోయింఇద్. విషయంలోకి వేళ్తే.. టీవీ 9 తొడగొట్టడం అనే టైటిల్‌తో ఒక ప్రోగ్రాం చేశారు. దీనికి విజయ్ సోషల్ మీడియా ద్వారా కౌంటర్ ఇచ్చాడు. కొంత మంది తొడగొట్టడం దగ్గరే ఆగిపోయారు అంటూ పోస్టు పెట్టాడు. అయితే దీనికి టీవీ9 యాంకర్ తొడకొట్టడం అంటే ఇక బాలయ్యే కదా.. నేను కూడా అలాగే అనుకుంటున్నాను.. బాలయ్య ఫ్యాన్స్ కూడా అలాగే అనుకుంటారని తనదైన భాష్యం ఇచ్చింది. అంతే కాకుండా విజయ్ తొడకొట్టడం అనే పదం వాడాడు కాబట్టి.. బాలయ్య సినిమాల్లో తొడకొట్టడం తప్ప ఇంకేమీ ఉండదని విజయ్ చెప్పినట్టే భావించాలని… నేరుగా చెప్పొచ్చు కదా అని అడిగేసింది. దీనికి యాంకర్ దిమ్మ తిరిగేలా విజ సమాధం ఇచ్చాడు.

ఆ యాంకర్ అడిగిన ప్రశ్నకు కౌంటర్ ఇస్తూ.. బాలకృష్ణ అంటే తొడగొట్టడమేనా.. అయిన తొడగొట్టడం అనేది రాయలసీమ సాంప్రదాయం. బాలయ్య గారు.. కేవలం తొడ ఒక్కటే కొట్టరు.. నటిస్తాడు.. ఫైట్స్ చేస్తారు.. డ్యాన్స్ చేస్తారు అని అన్నాడు. కాని మీరు బాలయ్యను మాత్రమే ఎందుకు తీసుకొస్తారని ప్రశ్నించాడు. అందుకు యాంకర్.. బాలయ్య ఫ్యాన్స్ అలా అనుకుంటున్నారని అనగా.. ఏదీ ఒక బాలయ్య అభిమానితో మాట్లాడించండంటూ అడగటంతో.. యాంకర్ కు ఏం చెప్పాలో అర్ధం కాలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -