Tuesday, May 14, 2024
- Advertisement -

రజినీకాంత్ సినిమా కి 100 కోట్లు అడిగిన ఆర్నాల్డ్

- Advertisement -

భారత దేశం లో ఇప్పుడు  ముగ్గురే ముగ్గుర్  కమర్షియల్ డైరెక్టర్ ల మధ్య పోటీ సాగుతోంది , హీరోల పోటీ దారుణంగా ఉండే ఈ భారత చలన చిత్ర పరిశ్రమ లో ఇప్పుడు ఆ పోటీ దర్శకుల మధ్య మొదలైంది. ప్రముఖ దర్శకులు రాజ్ కుమార్ హిరానీ, శంకర్ , రాజమౌళి వీరు ముగ్గురూ ఇప్పుడు భారత చిత్ర పరిశ్రమ ని శాసిస్తున్నారు. బాహుబలి అంతటి భారీ విజయం సాధించడం తో ఇప్పుడు శంకర్ కన్ను దాని కలక్షన్ ల మీద పడింది. బాహుబలి ని అవుట్ చేసే పని లో ఉన్నారు శంకర్. 

ఆ క్రమం లో హాలీవుడ్ నీ తమిళ పరిశ్రమ ని కలిపేయడం కోసం ఏకంగా ఆర్నాల్డ్ ని రంగం లోకి దింపబోతున్నారు. టోటల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో తీయనున్న ఈ సినిమా కోసం ఇంటర్నేషనల్ స్టార్ ఆర్నాల్డ్  ని  రంగంలోకి దింపాడు. 

శంకర్ ఐ ఆడియో లాంచ్ సమయం లో ఆర్నాల్డ్ కి ఇక్కడ ఎంత క్రేజ్ ఉంది అనేది తేలింది. ఇప్పుడు రోబో 2 లో ఆర్నాల్డ్ ని తెచ్చుకుని పెట్టుకుని హాలీవుడ్ స్థాయి లో ఈ సినిమా ని తీయడం కోసం శంకర్ సన్నాహాలు చేస్తున్నారు. అధికారిక ప్రకటన రాకపోయినా ఈ సినిమా కి ఆర్నాల్డ్ ఓకే చెప్పాడు అని కానీ కాల్ షీట్ ల విషయం లో ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి అని తెలుస్తోంది. 

కనీసం నలభై రోజుల కాల్ షీట్ లు శంకర్ కోరుతూ ఉండగా ఆర్నాల్డ్ మాత్రం తన షెడ్యూల్ ని అనుసరించి ఇరవై ఐదు రోజులు మాత్రమె సమయం ఇవ్వగలరు దీని మీద చర్చలు సాగుతున్నాయి , ఇది ఓకే అయ్యాక అధికారిక ప్రకటన ఉంటుంది. ఆర్నాల్డ్ ఈ సినిమా కి 100 కోట్లు అడిగారు, అంటే రజినీ కాంత్ కంటే ఆయన పారితోషికం ఎక్కువ అన్న మాట అది కూడా విలన్ పాత్ర కి . 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -