Wednesday, May 15, 2024
- Advertisement -

దసరా పోయే దీపావళి కి అఖిల్ ?

- Advertisement -

అక్కినేని ఫామిలీ కి మూడవ తరం నటుడు గా వస్తున్న అక్కినేని అఖిల్ , అక్కినేని హీరోలు అంటే కేవలం లవర్ బాయ్ మాత్రమె కాదు అంటూ ఆ ఇమేజ్ తో పాటు యాక్షన్ ని కూడా నెత్తిన వేసుకున్నాడు మొదటి సినిమా తోనే.. ఈ సినిమాకి మాస్ దర్శకుడు గా పేరున్న వినాయక్ దర్శకుడు కావడం సరిగ్గా దసరా నాడు విడుదల కి సర్వం సిద్దం అవడం తో హ్యాపీగా ఉన్నారు నాగార్జున ఫాన్స్.

 కానీ అనుకోకుండా అక్టోబర్ 22 న సినిమా లేదు అంటూ నిన్న నితిన్ బాంబు పేల్చిన విషయం విధితమే.

 అనుకున్న టైం కి గ్రాఫిక్ పనులు అవలేదు అంటూ వంక పెట్టి ఈ సినిమా విడుదల ని వాయిదా వేసారు. కొత్త విడుదల తేదీ కూడా ఇప్పటివరకూ ప్రకటించక పోవడం తో అక్కినేని ఫాన్స్ కోపం లో ఉన్నారు. చిత్ర బృందం కి సన్నిహితంగా ఉండే వర్గాల ప్రకారం అందుతున్న సమాచారం ప్రకారం, దసరా మిస్ అయ్యింది కాబట్టి దీపావళి కి ఈ సినిమా విడుదల అవ్వాలి అని నాగార్జున ఆలోచిస్తున్నారట. అధికారికంగా అప్పుడే ప్రకటించే అవకాశం లేదు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -