Monday, May 20, 2024
- Advertisement -

రికార్డు రేటుకు ఆవేశం ఓటీటీ రైట్స్!

- Advertisement -

ఓటీటీల్లోనే సంచలనం సృష్టించింది మలయాళ మూవీ ఆవేశం.ఫాహద్ ఫాజిల్ నటించిన ఆవేశం బ్లాక్ బాస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యాక్షన్ కామెడీ చిత్రం దాదాపు రూ.150 కోట్ల వసూళ్లను రాబట్టింది. కేవలం రూ.30 కోట్లతో తెరకెక్కి ఈ రేంజ్ వసూళ్లను రాబట్టిందంటే అర్ధం చేసుకోవచ్చు.

సినిమాలో ఫాహద్ ఫజిల్ నటను ప్రేక్షకులు ఫిదా కాగా తాజాగా ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో రికార్డు రేటుకు దక్కించుకుంది. ఏకంగా రూ.35 కోట్లు చెల్లించి ఈ రైట్స్‌ను దక్కించుకుందని సమాచారం. ఓటీటీల్లో ఇదే రికార్డు ధర.

ఈ సినమా మే 9 నుండి స్ట్రీమింగ్ కానుంది. ఆవేశం చిత్రానికి జీతూ మాధవన్ దర్శకత్వం వహించగా హిప్‍స్టర్, మిథున్ జై, రోషన్ షానవాజ్, సాజిన్ గోపు, మన్సూర్ అలీ ఖాన్, ఆశిష్ విద్యార్థి కీరోల్స్ చేశారు. ఫాహద్ ఆయన భార్య, నటి నజ్రియా నజీమ్, అన్వర్ రషీద్ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -