Thursday, May 9, 2024
- Advertisement -

లావుగా ఉండే అవికా గోర్.. ఇప్పుడెలా ఉందో చూడండి

- Advertisement -

‘చిన్నారి పెళ్ళి కూతురు’ అనే సీరియల్ తెలుగులో మంచి ఫాలోయింది ఏర్పర్చుకుంది అవికా గోర్. ఆ తర్వాత హీరోయిన్ గా ’ఉయ్యాల జంపాల’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఈమెకు వరస ఆఫర్స్ వచ్చాయి. ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ ‘సినిమా చూపిస్తా మావ’ ‘ఎక్కడికి పోతావ్ చిన్నవాడా’ వంటి సినిమాల్లో నటించింది. అయితే తర్వాత ఈమె లావు గా తయారయ్యింది. దాంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.

ఏం వర్కౌట్ లు చేసిందో ఏమో కానీ ఇప్పుడు చాలా సన్నబడి ‘రాజుగారి గది’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం కూడా కమర్షియల్ సక్సెస్ సాధించింది. ఇక అవికా ఈ చిత్రం ప్రమోషన్ల టైంలోనే గ్లామర్ పాత్రలకు నేను రెడీ అనే హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ కామెంట్స్ నిజం చేస్తూ చిన్న డ్రెస్ వేసుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంత చేంజ్ ఓవర్ ఏంటి అవికా అని ఆమె ఫోటోలకు కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. అసలు ఇలా ఎలా మారి పోయారు అనే ప్రశ్నకి సమాధానం ఇస్తూ.. నా బద్ధకం వల్లనే నేను లావుగా తయారయ్యాను.

ఒక ఫంక్షన్ కి వెళ్తే నన్ను కొందరు బొండంలా ఉన్నావని హేళన చేసారు. వారి మాటలకు కోపమొచ్చి స్లిమ్ గా మారాలని గట్టిగా నిర్ణయించుకున్న. ప్రస్తుతం 12కిలోల బరువు తగ్గి స్లిమ్ గా అయ్యాను. నన్ను ట్రోల్ చేసిన వాళ్లకు నేను సరైన సమాధానం ఇచ్చానని భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. మరి ఈ అమ్మడి ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మరి ఈ ఫోటోలు చూసాకైన ఈ అమ్మడికి ఆఫర్స్ ఇస్తారేమో చూడాలి.

https://www.instagram.com/p/B9yjrgBgc6_/
https://www.instagram.com/p/B9yjX5zgyY4/
https://www.instagram.com/p/B7JV3VhgJia/
https://www.instagram.com/p/B6qWb6UAc6f/

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -