Tuesday, May 21, 2024
- Advertisement -

కెరీర్ మొదట్లో ధోనీని ఆ ప్రాబ్లమ్ బాధపెట్టింది : కిరణ్ మోర్

- Advertisement -

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీని కెరీర్ మొదట్లో ఓ ప్రాబ్లమ్ బాధపెట్టిందని భారత మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోర్ వెల్లడించారు. 2004లో భారత్ జట్టులోకి వచ్చిన ధోనీ.. మొదట పవర్ హిట్టర్ గా వెలుగులోకి వచ్చాడు. ప్రధానంగా పాకిస్థాన్‌తో జరిగిన సిరీస్‌లో మిడిలార్డర్‌లో ఆడిన ధోనీ తన ఫినిషింగ్ స్కిల్స్‌తో అందర్నీ ఆకట్టుకున్నాడు. కెరీర్ మొదట్లో బ్యాట్స్ మెన్ గా ప్రూవ్ చేసుకున్న ధోనీ.. పేలవ వికెట్ కీపింగ్‌తో తీవ్ర విమర్శలు ఎదుర్కున్నాడని కిరణ్ మోర్ వెల్లడించాడు.

వన్డేల్లో అతని కీపింగ్ ఫర్వాలేదనిపించినా.. టెస్టుల్లో మాత్రం గొప్పగా ఉండేది కాదని మోర్ చెప్పుకొచ్చాడు. అయితే.. తన కీపింగ్ బలహీనతల్ని గుర్తించిన ధోనీ.. వాటిని అధిగమించేందుకు తీవ్రంగా శ్రమించినట్లు కిరణ్ మోర్ వెల్లడించాడు. “ధోనీ ఎంత ప్రతిభావంతుడో..? మనం అందరం చూశాం. కానీ.. వికెట్ కీపింగ్‌లో మాత్రం అతని సామర్థ్యంపై మొదట్లో కొందరు సందేహం వ్యక్తం చేశారు. వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఏడాది తర్వాత టెస్టుల్లో ధోనీ ఆడాడు.

కానీ.. వన్డేలతో పోలిస్తే..? టెస్టుల్లో కీపింగ్ చాలా భిన్నం. దాంతో.. ధోనీకి కొత్త సమస్య మొదలైంది.. అతడ్ని బాధపెట్టింది కూడా. అయితే.. టెస్టుల్లో రాణించాలంటే శ్రమించాల్సిందేనని ధోనీ వేగంగా గ్రహించగలిగాడు. అందుకోసం కష్టపడ్డాడు. ఇంకోవైపు టీమిండియా మేనేజ్ మేంట్ కూడా అతనికి వరసగా ఛాన్సులు ఇచ్చింది. ఎందుకంటే.. కేవలం 3- 4 మ్యాచ్‌ల్లోనే ఆటగాడి సామర్థ్యంపై ఓ అంచనాకి రాకూడదని అప్పట్లో మేనేజ్‌మెంట్ భావించింది.’’ అని కిరణ్ మోర్ తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -