Tuesday, April 30, 2024
- Advertisement -

ఇక సినిమాలు చేయ‌ను

- Advertisement -
  • అవికాగోర్ సంచ‌ల‌న‌ ప్ర‌క‌ట‌న‌
  • ద‌ర్శ‌క‌త్వం వైపు ఆస‌క్తి

ఉయ్యాల జంపాలా సినిమాతో హీరోయిన్‌గా మారిన అవికాగోర్ ఇక సినిమాలు చేయ‌న‌ని ప్ర‌క‌టించింది. తాను సినిమాలు చేయ‌ను.. ద‌ర్శ‌క‌త్వం వైపు వెళ్తానంటోంది. ఎందుకలా ప్ర‌క‌టించిందో అర్థం కాలేదు. కొంద‌రేమో సినిమా అవ‌కాశాలు రాక ఆందోళ‌న‌లో ఉంద‌ని, న‌ట‌నపై ఆస‌క్తి లేద‌ని చెబుతోంది. బాల‌న‌టిగా మొద‌లైన త‌న ప్ర‌స్థానం సినిమాల్లో హీరోయిన్‌గాను రాణించింది. అయితే ఇటీవ‌ల కాలంలో సినిమా అవ‌కాశాలు రాలేదు. అందుకే మానేస్తాన‌ని ప్ర‌క‌టించింది. ఉయ్యాల జంపాలా, ల‌క్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్త మావ‌, ఎక్క‌డికి పోతావు రా చిన్న‌వాడ‌, త‌ను నేను త‌దిత‌ర సినిమాలు చేసిన ఈ అమ్మ‌డు ఎందుకు విర‌మించుకుంటా అన్న‌దో తెలియ‌దు.

బాల నటిగా పరిచయమై.. హీరోయిన్‌గా మారిన అవికాగోర్ తాను సినిమాల్లో నటించను అని ప్ర‌క‌టించింది. ఇక హీరోయిన్‌గా నటించను అని స్పష్టం చేసిందీమె. ఎందుకలా అంటే.. దర్శకత్వం మీద కాన్సన్ ట్రేట్ చేస్తానని అంటోంది. నటించడంపై తనకు ఇక ఆసక్తి లేదని దర్శకత్వం మీదే పని చేస్తానని అంటోంది. అయితే ఇది శాశ్వతంగా బ్రేక్ కాదని కొంత కాలమే అని చెబుతోంది. ఈ అమ్మడికి అవకాశాలు కూడా ఈ మధ్య పెద్దగా ఏమీ లేవు. అందుకే ఇలా చేస్తోందేమో అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.అవికా రాజ్‌త‌రుణ్‌తో క‌లిసి ఉయ్యాల జంపాలా, సినిమా చూపిస్త మావ‌ సినిమాల్లో న‌టించింది. నిఖిల్ స‌ర‌స‌న ఎక్క‌డికి పోతువురా చిన్న‌వాడ సినిమాలో కూడా న‌టించింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -