Monday, April 29, 2024
- Advertisement -

మహేష్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు!

- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న చిత్రం బ్రహ్మోత్సవం. ఈ చిత్రంలో మహేష్ సరసన సమంత, కాజల్, ప్రణతీ లు హీరోయిన్స్ గా నటిస్తుండగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ బ్రహ్మోత్సవం సినిమా విషయంలో బయపడుతున్నారు.

బ్రహ్మోత్సవం హిట్ అవుతుందా ? లేక ఆ రెండు సినిమాల్లాగే ఫ్లాప్ అవుతుందా అని తెగ టెన్షన్ పడుతున్నారు. ఆ రెండు సినిమాలు ఏంటి ? అని అనుకుంటున్నారా ? ఇంతకుముందు మహేష్ నటించిన రెండు సినిమాలు మే నెలలో రిలీజ్ అయి భారీ పరాజయం పొందాయి అవి నిజం, నాని. ఈ రెండు సినిమాలు కూడా మే నెలలో రిలీజ్ అయి ఫ్లాప్ కావడంతో మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత మే నెలలో బ్రహ్మోత్సవం చిత్రం రిలీజ్ అవుతుండటంతో మహేష్ ఫ్యాన్స్ గుండెల్లో రైళ్ళు పరుగెత్తుతున్నాయి.

మహేష్ కు మే నెల గండం ఉండటంతో బ్రహ్మోత్సవం దాన్ని బ్రేక్ చేసి హిట్ కొడుతుందా లేక చతికిల బడుతుందా అని ఇదై పోతున్నారు. మరి సెంటిమెంట్ ప్రకారం ఫ్లాప్ అవుతుందా ? లేక ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేసి సూపర్ హిట్ అవుతుందా అన్న టెన్షన్ లో ఉన్నారు అభిమానులు. మరి బ్రహ్మోత్సవం ఎలా ఉందో తెలియాలి అంటే సినిమా వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఈ సినిమా తర్వాత మహేష్ మురగదాస్ దర్శకత్వంలో నటించనున్నాడు. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించానున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -