Monday, April 29, 2024
- Advertisement -

ఈడోరకం ఆడోరకం మూవీ రివ్యూ!

- Advertisement -

మంచు ఫ్యామిలీ హీరోలకి హిట్ ఒచ్చి చాలా కాలమే అవుతోంది అని చెప్పాలి , ముఖ్యంగా మోహన్ బాబు పెద్ద కొడుకు విష్ణు ఈ మధ్య కాలం లో హిట్ మొఖం చూసినట్టు లేదు. డైనమైట్ సినిమా మీద – దేవా కట్ట మీద పెట్టుకున్న ఆశలు అడి ఆశలే అయ్యాయి అతనికి. కొత్త సినిమా ఈడోరకం  ఆడొక రకం లో రాజ్ తరుణ్ పక్కన నటించిన విష్ణు ఈ సినిమా తో కామెడీ ట్రాక్ లోకి ఒచ్చేసాడు.

డీ లాంటి కామెడీ సినిమాలే విష్ణు కి బ్రేక్ ఇవ్వడం తో విష్ణు మళ్ళీ కామెడీ ట్రాక్ ని అందుకున్నడు అయితే ఈ సారి అది మల్టీ స్టారర్ సినిమా అవడం విశేషం. ఈ సినిమా లో విష్ణు పక్కన సోనరిక హీరోయిన్ గా చెయ్యగా , రాజ్ కి జోడీ గా హేబా పటెల్ చేసింది. రాజేంద్ర ప్రసాద్ , పోసాని లాంటి ప్రధాన తారాగణం ఉండనే ఉంది. డైరెక్టర్ నాగేశ్వర రెడ్డి ఈ సినిమాని ఎంత మేరకు లాక్కోచ్చారో చూడాలి మరి.

స్టొరీ – పాజిటివ్ లు:

అశ్విన్ – అర్జున్ ఇద్దరూ బాగా తిక్ ఫ్రెండ్స్ . అశ్విన్ ( రాజ్ తరుణ్ ) తండ్రి పోసాని కాగా అర్జున్ (విష్ణు ) తండ్రిగా రాజేంద్ర ప్రసాద్ కనిపిస్తారు. ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయినా ఇద్దరిలో చాలా డిఫరెంట్ మెంటాలిటీ లు ఉండడం చూసి వారి తల్లితండ్రులు కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. అనుకోకుండా అనాథ అయిన సోనారికా ని చూసి లవ్ లో పడిన హీరో విష్ణూ ఆమె కోసం ఆమె వెంటనే తిరుగుతూ తాను కూడా అనాథ అని చెప్తాడు. తన ఇంట్లో వారు అనాథ ని పెళ్లి చేసుకుంటే ఒప్పుకోరు కాబట్టి అశ్విన్ ని తన లవర్ కి అన్నగా పరిచయం చేసి పెళ్లి కి దగ్గర అవుతాడు. ఇంటర్వెల్ వరకూ వాళ్ళిద్దరి పెళ్లి కోసం నడిచిన కథ ఇలోగా హేబా పటేల్ రాజ్ తరుణ్ జీవితం లోకి రావడం తో కథ మొత్తం అడ్డం తిరుగుతుంది. అక్కడ నుంచీ డిఫరెంట్, కన్ఫ్యూజింగ్ కామెడీ తో సినిమా వెళుతూ ఉంటుంది. రాజ్ తరుణ్ తన క్యారెక్టర్ చాలా పర్ఫెక్ట్ గా చేసాడు అని చెప్పాలి. ఒకానొక దశ లో విష్ణు ని డామినేట్ చేసేసాడు. విష్ణూ కూడా తన పరిధి లో చాలా బాగా చేసాడు. చాలా ఇంప్రూవ్ అయ్యాడు. సెంటిమెంట్ సీన్ లలో రక్తి కట్టిస్తున్నాడు విష్ణు. సోనరిక నటన కంటే అందాల మీద ఎక్కువ ద్రుష్టి పెట్టాడు డైరెక్టర్. హేబా పటేల్ పాత్ర ఎక్కువగా కుమారీ 21 ఎఫ్ ని గుర్తు చేస్తూ ఉంటుంది . రాజేంద్ర ప్రసాద్ , రవిబాబు లు ఉన్న సన్నివేశాలు ఫుల్ కామెడీ తో సాగాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా ఇంటరెస్టింగ్ గా తీసుకువెళ్ళాడు. కన్ఫ్యూజన్ కామెడీ అదిరిపోయింది . పాటలు కూడా బాగున్నాయి . 

నెగెటివ్ :

ఫస్ట్ హాఫ్ ని కుదురు గా తీసుకువెళ్ళిన డైరెక్టర్ సెకండ్ హాఫ్ విషయం లో కుదేలు అయ్యాడు. అర్ధం లేని కామెడీ ని పెట్టి చాలా స్లో చేసి పారేసాడు. స్క్రీన్ ప్లే ఈ సినిమాకి అతిపెద్ద మైనస్ అని చెప్పాలి. పైగా వల్గర్ కామెడీ ఫామిలీస్ కి చిరాకు తెప్పించి తీరుతుంది . కన్ఫ్యూజన్ కామెడీ ఎంత బాగున్నా అందులో కూడా అవసరం లేని కక్క్రుత్తి కామేడీ పెట్టడం విసుగు తెప్పించింది. డైరెక్టర్ ఎక్కువగా సెకండ్ హాఫ్ మీద ద్రుష్టి పెట్టి ఉంటే బాగుండేది. తెలుగు కామెడీ సినిమాలలో వల్గారిటీ కి ఎక్కువ స్కోప్ పెరుగుతోంది అనుకుంటున్న తరుణం లో ఇలాంటి సినిమా ఇంకా విసుగు తెప్పిస్తుంది తప్ప మెప్పించే అవకాశం ఎక్కడా లేదు. హేబా పటేల్ పాత్ర కూడా సరిగ్గా కుదరలేదు. సోనరికా అందాల ఆరబోత కి తప్ప ఒక్క డైలాగ్ కూడా సరిగ్గా చెప్పలేదు. సెంటిమెంట్ సీన్ లు పర్లేదు అనుకున్న క్రమం లో గ్రిప్ మిస్ అవుతూ ఒచ్చింది 

మొత్తంగా , ఈడొక రకం ఆడొక రకం సినిమా పూర్తిగా సెకండ్ హాఫ్ తో డౌన్ అయ్యింది అని చెప్పచ్చు . స్క్రీన్ ప్లే విపరీతంగా డ్రాగ్ అవ్వడం తో కాస్తో కూస్తో నవ్వుకున్న ఫస్ట్ హాఫ్ మీద కూడా విసుగు ఒచ్చేస్తుంది. నాగేశ్వర రెడ్డి లాంటి సీనియర్ డైరెక్టర్ స్క్రీన్ ప్లే ని సరిగ్గా హ్యాండిల్ చెయ్యలేక పోవడం ఇబ్బందిగా అనిపిస్తుంది. వీక్ ఎండ్ లో మరీ బోర్ కొడితే ఒక్కసారి చూడదగ్గ సినిమా ఇది. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -