Sunday, May 5, 2024
- Advertisement -

షాకింగ్ః ఎన్టీఆర్‌గా బాలయ్య సూట్ కాలేదన్న తేజ…. సినిమానే ఆపేస్తానన్న బాలయ్య

- Advertisement -

ఎన్టీఆర్ బయోపిక్ సినిమా తీవ్ర సంకట పరిస్థితుల్లో పడింది. బాలయ్య-తేజల మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు వచ్చాయని తెలుస్తోంది. బాలయ్య అయితే సినిమాను తీయడం ఆపేస్తానని హెచ్చరించాడట. ఈ సినిమాకు నిర్మాత కూడా బాలయ్యే మరి. తన తండ్రి జీవితకథను తెరకెక్కించే బాధ్యతను తేజకు ఏరికోరి అప్పగించాడు బాలయ్య. అయితే యంగ్ ఎన్టీఆర్ గెటప్‌లో బాలయ్యపై టెస్ట్ షూట్ చేసిన తేజ మాత్రం యువ ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య అస్సలు సూట్ కావడం లేదని అభిప్రాయపడ్డాడట. నందమూరి బంధువులకు కొంతమందికి చూపించి వాళ్ళతో కూడా అదే అభిప్రాయం చెప్పాడట. ఈ విషయం మొత్తం తెలుసుకున్న బాలయ్య తేజపై ఆగ్రహం వ్యక్తం చేశాడని తెలుస్తోంది.

నందమూరి కుటుంబ సభ్యులతో పాటు తేజ కూడా యువ ఎన్టీఆర్‌గా తారక్ అయితే బాగుంటుందని, సీనియర్ ఎన్టీఆర్‌గా అయితే బాలయ్య కనిపించినా మరీ ఆడ్‌గా ఉండదని అభిప్రాయపడుతున్నారు. యువ ఎన్టీఆర్‌గా బాలయ్య కనిపిస్తే ఆ ఎన్టీఆర్ ఇమేజ్ కూడా డ్యామేజ్ అయ్యేలా ఉంటుందని చెప్తున్నారట. అంతే కాకుండా నందమూరి వంశం మొత్తంలోకి ఆ ఎన్టీఆర్ పోలికలతో అచ్చుగుద్దినట్టు ఊడిపడ్డ తారక్ ఒక్కడికే యువ ఎన్టీఆర్‌గా జనాలు నమ్మే స్థాయిలో కనిపించే అవకాశం ఉందని….ఇంకెవరు యాక్ట్ చేసినా ప్రేక్షకులతో పాటు స్వర్గీయ ఎన్టీఆర్ అభిమానులు కూడా నవ్వుకోవడం ఖాయమని బాలయ్యకు సూటిగా చెప్పేశారని తెలుస్తోంది. బిజినెస్ యాంగిల్‌లో కూడా బాలయ్య-ఎన్టీఆర్‌లు కలిసి నటిస్తే సినిమా క్రేజ్ పీక్స్‌కి వెళుతుందని బాలయ్యకు సలహాలు ఇచ్చారట. అయితే లోకేష్‌కి పోటీ అవుతాడేమో అని ఎన్టీఆర్‌ని అణిచే ప్రయత్నంలో ఉన్న చంద్రబాబుకు వ్యతిరేకంగా తాను నిర్ణయం తీసుకోలేనని బాలయ్య చెప్పాడట. అయితే నేనే యాక్ట్ చేయాలి….లేదా సినిమా ఆపేయాలి. నీ వళ్ళ కాదంటే చెప్పు …..ఇంకో డైరెక్టర్‌ని తీసుకుంటానని తేజతో చెప్పాడట బాలయ్య. ఇప్పుడు ఈ విషయం తేలకే నందమూరి తారకరామారావు బయోపిక్ సినిమా షూటింగ్‌తో పాటు అన్ని కార్యక్రమాలను వాయిదా వేసేశారు. ముందు ముందు ఈ పరిణామాలు ఏ మలుపు తిరుగుతాయో…….నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర సినిమా ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -