Sunday, May 19, 2024
- Advertisement -

ధోనీ అనుభ‌వాన్ని ఎవరైనా కొన‌గ‌ల‌రా…?

- Advertisement -

భారత్‌ క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనికి ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి మరొకసారి మద్దతుగా నిలిచాడు. ఒక ఆటగాడిగా, ఒక కెప్టెన్‌గా, ఒక వికెట్‌ కీపర్‌గా ఎంతో అనుభవం ఉన్న ధోనిలో ఇంకా ఎంతో అసాధారణ ప్రతిభ దాగి వుందని రవిశాస్త్రి కితాబిచ్చాడు. దక్షిణాఫ్రికా గడ్డపై సుదీర్ఘ పర్యటనని ఇటీవల ముగించుకున్న భారత్ జట్టు.. మూడు టెస్టుల సిరీస్‌ని 1-2తో చేజార్చుకున్నా.. ఆరు వన్డేల సిరీస్‌ని 5-1తో, మూడు టీ20ల సిరీస్‌ని 2-1తో చేజిక్కించుకున్న విషయం తెలిసిందే.

అయితే ఈ సిరీస్‌లో వికెట్ కీపర్‌గా మహేంద్రసింగ్ ధోనీ అద్భుతంగా రాణించాడు. అయితే బ్యాట్స్‌మెన్‌‌గా మాత్రం రెండు మ్యాచ్‌ల్లో మినహా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. దీంతో అతనిపై విమర్శలు రావడంతో స్పందించిన రవిశాస్త్రి.. ధోనీ అనుభవమే టీమిండియాకి వెలకట్టలేని ఆస్తి అని వివరించాడు.

అతని అనుభవానికి జట్టులో ప్రత్యామ్నాయమే లేదు. టీమిండియాకి అతను వెలకట్టలేని ఆస్తి. ధోనీ అనుభవం మార్కెట్‌లో దొరికేది కాదు.. అమ్మేది అంతకంటే కాదు. వన్డే, టీ20 మ్యాచ్.. చివరి ఓవర్లలో ధోనీ లాంటి ఫినిషర్ క్రీజులో ఉంటే.. ఆట గమనమే మారిపోతుంది. అలాంటి ఫినిషర్లు క్రికెట్ ప్రపంచంలో కొందరే ఉన్నారు. వయసు పెరుగుతున్నా.. ఫిటెనెస్ కాపాడుకోవడంలో ధోనీకి ఎవరూ సాటిరారేమో..?’ అని రవిశాస్త్రి ప్రశంసించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -