Thursday, May 9, 2024
- Advertisement -

భయపడుతున్న నాగార్జున

- Advertisement -

సంక్రాంతి సినిమా లలో టాప్ గా నిలిచి . ఒక టాప్ హీరో యాభై కోట్లు కలక్ట్ చెయ్యగలడు అని నిరూపించాడు హీరో నాగార్జున. సోగ్గాడే చిన్ని నాయన సినిమా దెబ్బతో నాగార్జున మార్కెట్ తో పాటు క్రేజ్ కూడా రెండవ లెవెల్ కి చేరిపోయాయి. అయితే ఈ సినిమా సీక్వెల్ విషయం లో నాగార్జున భయపడుతున్నాడు అని తెలుస్తోంది.

దైంకి కారణం లేకపోలేదు. ఇతర భాషల్లో సీక్వెల్ కి భారీ క్రేజ్ నడుస్తూ ఉంటుంది. మీరు ఏం తీసినా మేం చూస్తాం అంటూ హిట్ సినిమాకీ ఫట్ సినిమాకీ కూడా సీక్వెల్స్ తీస్తేస్తూ ఉంటారు మేకర్ లు. అక్కడ సీక్వెల్ కే ఎక్కువ సంపాదన రాబడతారు కానీ ఇక్కడ పరిస్థితి వేరు. సీక్వెల్ సినిమాల విషయంలో తెలుగులో సక్సెస్ రేటు జీరో అని చెప్పొచ్చు.

ఒకట్రెండు ఆడాయి కానీ… అవి కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో మాత్రం కాదు. అందుకే ఆ విషయంలోనే నాగ్ ఇప్పుడు భయపడుతున్నాడట. ఇటీవల సూపర్ సక్సెస్ అయిన  సోగ్గాడే చిన్ని నాయనాకి సీక్వెల్ తీయాలనే ఆలోచనలో నాగ్ ఉన్నాడన్న విషయం తెలిసిందే. సోగ్గాడే సినిమాలో చేసిన బంగార్రాజు పాత్రతో సీక్వెల్ చేయాలనేది నాగ్ ఆలోచన. కానీ ఈ సెంటిమెంట్ కారణంగా నాగ్ భయపడుతున్నాడు అని అంటున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -