Sunday, June 16, 2024
- Advertisement -

పవన్ కళ్యాణ్ ఒక జోకర్

- Advertisement -

బాలీవుడ్ వారికీ కమల్ ఆర్ ఖాన్ పెద్ద జోక్ అని ఎవ్వరికీ తెలీదు. తనొక పెద్ద మేధావి లాగా హడావిడి చేస్తూ ఎవరూ అడగకపోయినా సినిమాలకి రివ్యూ లు ఇస్తూ ఉంటాడు ఈ మెంటల్ ఫెలో. బాలీవుడ్ సెలెబ్రిటీ ల మీద పిచ్చ పిచ్చ కూతలు కూస్తూ ఎప్పుడూ తిట్లు తిడుతూ ఉంటాడు ఇతగాడు.

బాలీవుడ్ లో ఇద్దరు ముగ్గురు హీరోయిన్ ల అందాల మీద కూడా వ్యాఖ్యలు చేసి నేత్తిమీదకి తెచ్చుకున్నాడు. తను ఎవరో ఒకరిని కెలకడం వాళ్ళతో తిట్టించుకోవడం కమల్ కి కొత్తేమీ కాదు. అప్పట్లో ప్రభాస్ – రానా వేస్ట్ అనీ బాహుబలి చెత్త సినిమా అనీ గోల చేసాడు. జనం అంతా ఇప్పుడు గబ్బర్ సింగ్ మేనియాలో ఉండగా కమల్ కి పవన్ ని కెలికితే కాస్త మంచి ఫేం ఒస్తుంది అనిపించినట్టు ఉంది కాబోలు.

పవన్ కళ్యాణ్ ని తిట్టడం మొదలు పెట్టాడు.  ‘‘ఈ పవన్ కళ్యాణ్ కూడా హీరో అయితే.. ప్రపంచంలో ఎవ్వరైనా హీరో కావచ్చు. అసలీ సౌత్ ఇండియా జనాలకు ఏమైంది? సినిమాల్లో ఈ కార్టూన్ ను వాళ్లెలా చూస్తారు? వెరీ బ్యాడ్ చాయిస్. నేనైతే ఈ జోకర్ – కార్టూన్ సినిమాల బదులు రాజ్ పల్ యాదవ్ (బాలీవుడ్ కమెడియన్) సినిమాలు చూస్తా’’ అని వ్యాఖ్యానించాడు కమాల్. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -