- Advertisement -

భర్త మహాశయులకు విజ్ఞప్తి…మెలోడి

- Advertisement -

కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న భర్త మహాసయులకు విజ్ఞప్తి సినిమా సంక్రాంతి 2026 సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అశికా రంగనాథన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన మొదటి పాట ‘బెల్లా బెల్లా’కి మంచి స్పందన లభించడంతో మ్యూజికల్ ప్రమోషన్స్ వేగం అందుకున్నాయి.

ఇప్పుడు మేకర్స్ రెండో సింగిల్ ‘అద్దం ముందు’ను విడుదల చేశారు. రవితేజ–డింపుల్ హయాతీల ప్రేమలో మునిగిపోయిన భావాలను అందంగా చిత్రీకరించిన ఈ మెలోడి మనసుకు హత్తుకునేలా ఉంటుంది. భీమ్స్ సెకిరోలియో సంగీతం అందించిన ఈ పాటలో చందర్భోస్ రాసిన సాహిత్యం ఎంతో హృద్యంగా ఉంది. శ్రేయా ఘోషాల్, కపిల్ కపిలాన్ గానం ఈ ట్రాక్‌కు మరింత అందం తెచ్చాయి.

యూరప్‌లోని అందమైన లొకేషన్లలో ఈ పాటను చిత్రీకరించారు. ఎస్‌ఎల్‌వి సినిమాస్ అధినేత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో సునీల్, సత్య, వెన్నెల కిశోర్, శుభలేఖ సుధాకర్, మురళీధర్ గౌడ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -