- Advertisement -

బీస్ట్ అవతారంలో శర్వానంద్ ‘భోగి’!

- Advertisement -

శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భోగి’ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ ఈరోజు విడుదల చేశారు. ముందుగా ప్రకటించినట్లుగానే పోస్టర్‌ను ఆవిష్కరించగా, ఇందులో శర్వానంద్ పూర్తిగా భిన్నమైన రూపంలో కనిపిస్తూ అభిమానులను ఆశ్చర్యపరిచారు.

ఈ చిత్రంలో ఆయన పాత్ర పేరు ‘గంగా’. గట్టిగా పెరిగిన మీసం, చేతిలో పదునైన ఆయుధంతో రఫ్ అండ్ ఫియర్‌లెస్ లుక్‌లో కనిపిస్తున్న శర్వానంద్ పోస్టర్‌లో తీవ్రతను చూపిస్తున్నారు. ఈ ఫస్ట్ లుక్ సినిమాకి ఉన్న పవర్‌ఫుల్ టోన్‌ను స్పష్టంగా తెలియజేస్తోంది.

‘భోగి’ చిత్రం 2026 ఆగస్టు 28న పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది. అదే సమయంలో నాని నటిస్తున్న ది ప్యారడైజ్ ఆగస్టు 21న విడుదల కానుండటంతో, రెండు సినిమాల మధ్య ఆసక్తికరమైన బాక్సాఫీస్ పోటీ నెలకొననుంది.

ఈ చిత్రంలో శర్వానంద్ సరసన అనుపమ, డింపుల్ హయాతి నటిస్తుండగా ఈ చిత్రాన్ని కే.కే. రాధామోహన్ ‘శ్రీ సత్యసాయి ఆర్ట్స్’ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. సంగీతాన్ని భీమ్స్ అందిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -