- Advertisement -

కోలీవుడ్‌లోకి ‘బేబీ’ ఫేమ్..డెబ్యూకు రెడీ!

- Advertisement -

బ్లాక్‌బస్టర్ చిత్రం ‘బేబీ’ తో మంచి గుర్తింపు పొందిన నటి వైష్ణవి చైతన్య. ఈ సినిమా హిట్ తర్వాత వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు వైష్ణవి. ప్రస్తుతం వైష్ణవి …ఆనంద్ దేవరకొండతో సినిమా చేస్తోంది.

తాజా సమాచారం ప్రకారం, వైష్ణవి త్వరలో తమిళ చిత్రసీమలో పూర్తి స్థాయి హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్నారట. ఈ ప్రాజెక్ట్‌లో జీవీ ప్రకాష్ కుమార్‌తో జోడీ కట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ చిత్రానికి విఘ్నేష్ కార్తీక్‌ కథను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికీ ఈ సినిమా ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ, ఇది వైష్ణవి కెరీర్‌లో ఒక కీలక అడుగుగా భావిస్తున్నారు. గతంలో ఆమె అజిత్ నటించిన వాలిమైలో చిన్న పాత్రలో కనిపించారు. అయితే, హీరోయిన్‌గా ఇది ఆమె తొలి తమిళ చిత్రం అవుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -