Friday, May 17, 2024
- Advertisement -

సెక్స్ టార్చర్ ఘోరంగా పెట్టారు.. ఆత్మహత్య అనేసింది.. : నటి భువనేశ్వరి

- Advertisement -

నటి భువనేశ్వరి మీద తాజాగా కిడ్నాప్ కేసు నమోదైంది. భువనేశ్వరి మీద శ్రీలంకకు చెందిన చంద్రకుమార్ కేసు పెట్టారు. తన 23 ఏళ్ల కూతురిని ఆమె చట్ట విరుద్ధంగా కస్టడీలో ఉంచుకుందని కేసు వేశారు. దాంతో మద్రాస్ కోర్టు.. భువనేశ్వరి వెంటనే సరెండర్ కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఆమె హాజరయ్యారు. తనకు ఈ కేసుతో ఎలాంటి లింక్ లేదని.. ఇప్పుడు ఆ అమ్మాయి తన కస్టడీలో లేదని కోర్టుకు తెలిపింది.

పిటీషనర్ కూతురు కూడా ఈ కేసు విచారణకు హాజరయ్యారు. ఇపుడు తాను ఇపుడు భువనేశ్వరి వద్ద ఉండటం లేదని, భువనేశ్వరి దత్తపుత్తుడు మిథున్ శ్రీనివాసన్‌ను తన ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకున్నానని కోర్టుకు వెల్లడించారు. మ్యారేజ్ సర్టిఫికెట్ సమర్పించాలని ఆ అమ్మాయికి సూచించిన కోర్టు తదుపరి విచారణను నవంబర్ 21కి వాయిదా వేసింది. విచారణ అయిపోయిన తర్వాత భువనేశ్వరి మీడియాతో మాట్లాడారు.. తనను అనవసరంగా ఇందులోకి లాగుతున్నారని.. ఇది ఒక వ్యక్తికి సంబంధించిన సమస్యగా భావించాలని ఆమె కోరారు. ఆ అమ్మాయి ఫ్యామిలీకి చెందిన ఓ వ్యక్తి ఆమెను సెక్స్ టార్చర్ పెట్టారని, ఈ విషయం ఆమె తనతో చెప్పుకుందని భువనేశ్వరి తెలిపింది. ఏమైన కానీ ఇది పెద్ద సమస్య. ఆమె ఫ్యామిలీ సభ్యులే ఆ అమ్మాయిని ఆమెకి ఇష్టం లేని వ్యక్తితో సెక్స్ లో పాల్గొనాలని బలవంతం చేశారని, అది ఇష్టం లేని ఆమె తిరుచ్చిలోని ఇంటి నుండి తప్పించుకుని తన వద్దకు వచ్చిందని భువనేశ్వరి తెలిపారు. తన హేల్ప్ కావాలని ఆ అమాయి తన వద్దకు వచ్చినప్పుడు నాకు వేరే అవకాశం లేక .. ఒక మహిళగా సహాయం చేయాలనుకున్నాను.

ఆ అమ్మాయి తన వద్దకు వచ్చిన సమయంలో తన వద్ద ఆమె సేఫ్ గా ఉందని వెంటనే ముఖ్యమంత్రితో పాటు కమీషనర్‌కు లెటర్ రాసినట్లు భువనేశ్వరి తెలిపారు. ఆ అమ్మాయి తన వద్దకు వచ్చినపుడే.. ఆ విషయం ఆమె ఫ్యామిలీ సభ్యులకు తెలిపానని.. వారు తన ఇంటి వద్దకు వచ్చి ఆ అమ్మాయిని తమతో రమ్మని కోరారు. కానీ ఆమె వారితో వెళ్లేందుకు ఇష్టపడలేదు. బలవంతంగా పంపిస్తే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పింది. ఇది అసలు జరిగిన విషయం అని మీడియాకు భువనేశ్వరి తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -