Saturday, April 20, 2024
- Advertisement -

బిగ్ బాస్ సీజన్‌ 2 పార్టిసిపెంట్స్‌ ఎవరంటే..?

- Advertisement -

తెలుగు లో బిగ్ బాస్ మంచి సక్సెస్ సాధించింది. 70 రోజులు ఈ షో ని చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. ప్రధానంగా ఈ బిగ్ బాస్ మొదటి సీజన్ ను ఎన్టీఆర్ నడిపించిన విధానం అద్భుతం అని చెప్పొచ్చు. మొదటి సీజన్ విన్నర్ గా శివ బాలాజీ నిలిచాడు. అయితే తెలుగు బిగ్ బాస్ మీద మొదట్లో పెద్దగా అంచనాలు లేవు.

అందుకే ఈ షో పాల్గొనడానికి చాలా మంది ఆలోచించి వెనక్కి తిరిగారు. మొదటి సిజన్ తర్వాత బిగ్ బాస్ స్థాయి ఏంటో సినీ తారలకు అర్ధం అయింది. అందుకే ఇప్పుడూ వాళ్లు కూడా బిగ్ బాస్ షోలో పాల్గొనడానికి హౌస్ లో ఉండేందుకు ముందుకు వస్తున్నారు. మొదటి సీజన్ మంచి సక్సెస్ సాధించడంతో.. రెండో సీజన్ మొదలు పెట్టేందుకు బిగ్ బాస్ యూనిట్ ఆలోచనలో ఉంది. బిగ్ బాస్ ఏప్రిల్ లో మొదలు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఆరు నెలల ముందే బిగ్ బాస్ రెండో సీజన్ కోసం వారి డేట్లు తీసుకోవడం వల్ల వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని.. ఈలోపు ఎవరైన సినిమాలతో బిజీ ఉన్న రెండో సీజన్ వరకు కంప్లీట్ చేసుకోని.. హౌస్ లోకి ఎంట్రీ ఇవచ్చు అని ప్లాన్ చేస్తున్నారట. అయితే అప్పుడే ఈ బిగ్ బాస్ యాజమన్యం కొందరి స్టార్స్ ని సంప్రాదించారట. వారు కూడా దాదాపు ఓకే చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే వారు అగ్రిమెంట్ కూడా చేసుకోనున్నారు. మరి సీజన్ 2 లో పార్టిసిపెంట్స్ చేసే స్టార్ ఎవరంటే..

* హీరోయిన్ గా చేసిన ముద్దుగుమ్మ ఛార్మి
* సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా చేసిన ధన్య బాలకృష్ణ
* ఒకప్పుడు హీరోయిన్ గా చేసిన గజాల
* ప్రముఖ సింగర్ గీతామాధురి
* యాంకర్ లాస్య
* షార్ట్ పిల్మ్స్ తో పాటు.. కొన్ని సినిమాలో హీరోయిన్ గా నటించిన ఛాందిని చౌదరి
* ఆర్యన్ రాజేష్
* హీరోగా పేరు తెచ్చుకొని.. ప్రస్తుతం అవకాశాలు లేని హీరో తరుణ్
* ఓంకార్
* వైవా హర్ష
* నిన్నటి తరం హీరోయిన్ శ్రీదేవి
* బాల నటుడిగా, హీరోగా మెప్పించిన తనీష్
* కమెడియన్ వేణు
* హ్యాపీడేస్ హీరో వరుణ్ సందేశ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -