Thursday, May 16, 2024
- Advertisement -

అలీ, శ్రీముఖిలకు షాక్.. ఫైనల్లోరాహుల్..!

- Advertisement -

ఇటీవలే ఇంటి సభ్యులకు మంచి ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్. డైరెక్ట్ గా ఫైనల్ కు వెళ్లేందుకు దారి చూపించాడు. ఈ వారం నామినేషన్ ప్రక్రియకు బదులుగా టికెట్ టు ఫైనాల్ అని టాస్క్ ను చేపట్టాడు. ఈ టాస్క్ లో మొదటి పార్ట్ ఈజీగా జరిగినా రెండో పార్ట్ మాత్రం హింసాత్మకంగా జరిగింది. ఒకే మట్టిలో అలీ, బాబా పూల మొక్కలను నాటాలి. ఎక్కువ ఎవరు నాటితే వారికి రీచార్జ్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఈ టాస్క్ హింసాత్మకంగా మారుతుండటంరో టాస్క్ ను రద్దు చేశాడు బిగ్ బాస్.

ఎన్నిసార్లు చెప్పినప్పటికి అలీ.. హింసాత్మకంగా ఆడటంతో అతనిని ఫైనల్ రేసు నుంచి తప్పించినట్లు తెలిపాడు. దాంతో అలీ నామినేషన్ లోకి వచ్చి పడ్డాడు. డామినోస్ ను వరస క్రమంలో అమర్చాలని.. అలా ఎవరు ఎక్కువ డామినోస్ నిల్చి ఉంటాయో వారే విజేతలుగా నిలుస్తారని తెలిపాడు. అయితే ఈ టాస్క్ లో రాహుల్ కి గాలి దేవుడు సకరించడంతో రాహుల్ గెలిచాడు. శ్రీముఖి ఓడిపోయింది.

క్యూబ్స్‌తో పిరమిడ్ అంటే బాక్స్‌ను నిర్మించిందన్న కారణంతో టాస్క్‌లో శివజ్యోతి ఓడిపోయిందని, శ్రీముఖి గెలిచినట్టు బిగ్‌బాస్ ప్రకటించాడు. దాంతో ఫైనల్ టికెట్ రాహుల్ కి లభించిందని.. మిగిలిన వారంతా నామినేషన్ లోకి వచ్చినట్లు తెలిపారు. రాహుల్ ను రూంలోకి పిలిచి ఫైనల్ కు టికెట్ ఇచ్చాడు. దాంతో రాహుల్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇక తాను ఓడిపోయినందుకే రాహుల్ కు ఫైనల్ టికెట్ వచ్చిందని.. అందుకే థ్యాంక్స్ చెప్పాడని వరుణ్ తో అలీ చెప్పుకొచ్చాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -