Wednesday, May 7, 2025
- Advertisement -

ఆదర్శ్, హరితేజకి మరో బంపర్ ఆఫర్ తగిలింది

- Advertisement -

బుల్లితెరపై ఎన్టీఆర్ మొదటి సారిగా హోస్టింగ్ చేసిన షో బిగ్ బాస్. ఈ షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇటివలే ఈ షో ముగిసింది. ఈ బిగ్ బాస్ షోలో పార్టిస్పెంట్ చేసిన వారికి మంచి క్రేజ్ ఏర్పడింది. ఇందులో విజేతగా శివబాలాజీ నిలిచారు. ఫైనల్ లో చివరి వరకు నిలిచిన.. ఆదర్శ్, హరితేజలకు కూడా మంచి పేరు వచ్చింది.

బిగ్ బాస్ షో ద్వారా బాగా గుర్తింపు పొందిన వీరిద్దరినీ ఇంకో రియాలిటీ షోలో చూపించాలని స్టార్ మా భావిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో స్టార్ట్ చేయబోతున్న నీతోనే డ్యాన్స్ షోలో ఆదర్శ్, హరితేజలు పార్టిసిపేషన్ ఉండబోతుంది. పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ తొలిసారి, ఈ షోలో జడ్జిగా వ్యవహరిస్తోంది. ఇక ఆమెతోపాటు జానీ మాస్టర్, హీరోయిన్ అదాశర్మ జడ్జిలుగా ఉండబోతున్నారు.

ఉదయభాను హోస్ట్ చేస్తున్న ఇందులో.. ఆదర్శ్, హరితేజ జంటగా కనిపించనున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ షో తో బాగా ఆకట్టుకున్న వీరు.. మరోసారి డ్యాన్స్ రియాలిటీ షో ఆకట్టుంటారని కోరుకుంద్దాం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -