Wednesday, May 15, 2024
- Advertisement -

రెడ్ డ్రెస్‌లో అలరిస్తున్న బిందు మాధ‌వి

- Advertisement -

బిందు మాధవి…దక్షిణాదిన తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్న నటి. బిగ్ బాస్ తెలుగు ఓటీటీ విజేత. బిగ్ బాస్ ద్వారా ప్రజలకు చేరువైన బిందు…తన పాజిటివ్ థింకింగ్‌తో అశేషమైన ప్రేక్షకుల మద్దతు సంపాదించింది. అందుకే బిగ్ బాస్ తెలుగు ఫ్రాంచైజీ చరిత్రలో మొట్టమొదటి మహిళా విజేతగా నిలిచి రికార్డు సృష్టించింది.

ఇక ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలో నటిస్తూ ప్రేక్షకాదరణ పొందుతోంది ఈ బ్యూటీ. తాజాగా తన అందచందాలతో ఎరుపు రంగు డ్రెస్సులో అదరహో అనిపించింది. రెడ్ డ్రెస్‌లో బిందును చూసిన వారంతా షాక్‌ అవుతున్నారు.చెవి కమ్మలు, సన్నని నడుము ఓవరాల్‌గా జీరో సైజ్ బాడీతో మంత్రముగ్దులను చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ చేసేది బిందు. ఓ యాడ్‌లో బిందును గమనించిన శేఖర్ కమ్ముల తాను నిర్మాతగా వ్యవహరిస్తున్న ఆవకాయ్ బిర్యానీ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం కల్పించారు. తర్వాత బంపర్ ఆఫర్,2010లో ఓం శాంతి అనే సినిమాలో నటించింది. అదే సంవత్సరం దిల్ రాజు నిర్మించిన రామ రామ కృష్ణ కృష్ణ సినిమాలో రాం సరసన నటించి మెప్పించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -