Tuesday, April 30, 2024
- Advertisement -

ఆ హీరో అడిగితే.. ఆ పని అయినా చేస్తా.. : హీరోయిన్ టబు

- Advertisement -

టబు.. ఈమె పేరు వినగానే వెంటనే గుర్తుకు వచ్చే సినిమా నిన్నే పెళ్లాడుతా. ఈ సినిమాలో ఈమె నాగార్జున సరసన నటించింది. ఈ మూవీలో వీరి మధ్య రొమాన్స్ అద్భుతంగా వర్కవట్ అయింది. దాంతో వీరిద్దరి మధ్య ఏవో సంబంధాలు ఉన్నాయంటూ.. అప్పట్లో తెగ వార్తలు వచ్చాయి.

కానీ నిజానికి టబు లవ్ చేసింది.. పెళ్లి చేసుకోవాలనుకుంది మాత్రం బాలీవుడ్ హీరోనేనట. ఆ స్టార్ హీరో ఎవరో కాదు.. అజయ్ దేవగణ్. అతడు కాస్తా మరో హీరోయిన్‌ను పెళ్లాడటంతో ఇక టబు పెళ్లి చేసుకోకుండా అలాగే వుండిపోయింది. ఇటివలే మీడియా టబుని మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని అడిగితే.. తనకు తగిన వరుడిని మీరు చూసి పెడితే వెంటనే పెళ్లాడతానంటూ మీడియాకే రివర్స్ పంచ్ వేసింది.

అంతమాటన్నాక మళ్లీ మీడియా టబును పెళ్లి గురించి అడుగుతుందా…? అదలావుంటే తాజాగా అక్కినేని అఖిల్ నటిస్తున్న మూవీలో అతడి తల్లి పాత్రలో టబు నటిస్తోంది. ఇంకా అజయ్ దేవగణ్ నటిస్తున్న మరో చిత్రంలో కూడా ఆఫర్ కొట్టేసినట్లు తెలుస్తోంది. అసలు అజయ్ దేవగణ్ తనకు ఎంత చిన్న పాత్ర ఇచ్చినా వదిలే ప్రసక్తే లేదనీ, తకు అజయ్ అంటే అంత ఇష్టమంటూ ఈమె చెప్పుకొచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -