వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి రావాలని వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి తన ప్రయత్నాలను ముమ్మరం చేయనున్నారు. అందుకోసం వచ్చెనెల 2నుంచి అన్న వస్తున్నాడు పాదయాత్రను ప్రారంభించనున్నారు. దాదాపు ఆరు నెలలపాటు పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్రలో జగన్ కొత్త టార్గెట్‌ను ఫిక్స్ చేసుకున్నారు.
జగన్ మోహన్ రెడ్డి ఒకప్పుడు ముహూర్తాల గురించి పట్టించుకొనె వాడు కాదు కాని ప్రస్తుత పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఈ మధ్యనే బెంగళూరు వెళ్లి వస్తూ, శంషాబాద్ విమానాశ్రయ సమీపంలో ఉన్న చినజీయర్ స్వామి ఆశ్రమానికి జగన్ వెళ్లడం, ఆయన ఆశీర్వాదం తీసుకోవడం కూడా చూశాం. ఈ ఘటనను చూసి అందరు ఆశ్చర్యపోయారు. ఇక, పాదయాత్రను కూడా జగన్ ఎలా ప్రారంభిస్తున్నారంటే.. ముందుగా, తిరుమలకు కాలినడకన వెళ్లి స్వామిని దర్శించుకున్నాక పాదయాత్రను మొదలు పెట్టనున్నారు. హిందూ మత సాంప్రదాయాలకి జగన్ చాలా విలువ ఇస్తున్నారనడంలో సందేహంలేదు.
ఎన్నికల్లో విజయంపై ప్రధానంగా ఆయా కులాల సామాజిక ఓట్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కుల రాజకీయాలె ఎక్కువ. అందుకె జగన్ ఆరెండు వర్గాల ఓటర్లను ఆకట్టుకొనేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. హిందూ ఓట్లను ఆకర్శించె ప్లాన్ అమలవుతోందని టాక్ వినిపిస్తోంది. హిందూ ఓటర్లని ఆకర్షించే పనిలో భాగంగా ఈ ప్లాన్ అమలు అవుతోంది అని టాక్.
ఇంకోపక్క, క్రిస్టియన్ ఓటర్లను ఆకర్షించడం, ఎన్నికలకు వారిని సమాయత్తం చేసే బాధ్యతను తన బావ బ్రదర్ అనిల్ కుమార్ కు జగన్ అప్పగించినట్టు కథనాలు వస్తున్నాయి. రీసెంట్ గా సికిందరాబాద్ లో కొంతమంది పాస్టర్ల తో కూడా జగన్ సమావేశం అయ్యారు అని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏది ఏమైనా జగన్ తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. చివరికి ఏమౌతుందో చూడాలి.
