Saturday, May 4, 2024
- Advertisement -

‘జబర్దస్త్’ శాంతి స్వరూప్‌ను ముద్దు పెట్టుకోబోయిన యువకుడు..!

- Advertisement -

జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి పేరు సంపాధించుకున్నాడు శాంతి స్వరూప్‌. ఇతను ఎక్కువగా లేడీ గెటప్స్ వేస్తూ ఉంటాడు. అయితే తాజాగా శాంతి స్వరూప్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఈ మధ్య ప్రాంక్ వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి.

అలానే ఓ ప్రాంక్ వీడియో తీద్దామని ప్రయత్నించిన ఓ యువకుడు.. శాంతి స్వరూప్ దగ్గరికి వచ్చి నడుముపై చేయి వేశాడు. అంతటితో ఆగకుండా ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేయడంతో శాంతి స్వరూప్ సీరియస్ అయ్యాడు. ఆ యువకుడిని కొట్టడానికి చెప్పు కూడా తీశాడు. దీంతో ఆ యువకుడు తాము ప్రాంక్ వీడియో తీస్తున్నామని చెప్పాడు. అయినప్పటికీ శాంతి స్వరూప్‌ కస్సుమన్నాడు.

వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో శాంతి స్వరూప్ బూతులు తిట్టాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఓ సినిమా షూటింగ్‌లో శాంతి స్వరూప్‌ పాల్గొన్న సమయంలో ఇది జరిగింది. గతంలోనూ శాంతి స్వరూప్‌ పలు సార్లు చేదు అనుభవాలను ఎదుర్కొన్నాడు. తనకు ఇటువంటి అనుభవాలు ఎదురవుతున్నాయని పలు ఇంటర్వ్యూల్లోనూ కూడా చెప్పాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -